Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరెంట్ లేకుండా సెల్ ఫోన్ టార్చ్ సాయంతో చికిత్స!

Advertiesment
operation
, మంగళవారం, 18 అక్టోబరు 2022 (16:17 IST)
మహారాష్ట్రలో వైద్యులు కరెంట్ లేకుండా చికిత్స చేశారు. మహారాష్ట్రలో ఓ మంత్రికి చికిత్స చేస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సెల్‌ఫోన్‌లోని టార్చ్‌ సాయంతో వైద్యులు చికిత్స పూర్తి చేశారు. 
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి సందీపన్ భుమ్రే నిన్న ఔరంగాబాద్‌లోని ఘటి డెంటల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దంత పరీక్ష చేయించుకున్నారు. పరీక్షించిన వైద్యులు రూట్ కెనాల్ చేయించుకోవాలని మంత్రికి సూచించారు. ఆయన సరేననడంతో చికిత్స ప్రారంభించారు. 
 
ఆ తర్వాత కాసేపటికే ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మరో మార్గంలేక సెల్‌ఫోన్‌లోని టార్చ్‌ సాయంతో చికిత్స పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవ్యాంధ్రకు అమరాతి ఒక్కటే రాజధాని : రాహుల్ గాంధీ