Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడి ఎదుటే ప్రియురాలి న్యూడ్ వీడియో తీసిన దుండగులు...

Advertiesment
ప్రియుడి ఎదుటే ప్రియురాలి న్యూడ్ వీడియో తీసిన దుండగులు...
, గురువారం, 7 మార్చి 2019 (20:35 IST)
జంటగా ఉన్న ప్రేమికుల దగ్గరకు వెళ్లి నగలు, డబ్బు దోచుకోవడమే కాక, పోలీసులకు చెప్పేస్తారేమోనన్న అనుమానంతో ప్రయురాలి బట్టలు విప్పించి నగ్నంగా వీడియో తీసారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ ఘటన కర్ణాటకలోని కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
కెంగేరి ప్రాంతానికి చెందిన ఓ క్యాబ్‌డ్రైవర్, అదే ఏరియాకు చెందిన ఓ యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు ఊరికి వెళ్లవలసి రావడంతో క్యాబ్ డ్రైవర్ ఆమెను కెంగేరి రైల్వేస్టేషన్‌లో దిగబెట్టడానికి వచ్చాడు. స్టేషన్‌కి ఆలస్యంగా రావడంతో రైలు మిస్సయింది. ఇద్దరూ రేపు వెళ్లవచ్చని నిర్ణయించుకుని తిరిగి వచ్చేశారు. అప్పటికే చీకటి పడటంతో ఓ రైల్వేగేటు వద్ద కారు ఆపి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. 
 
ఇంతలో నలుగురు దొంగలు అక్కడకు వచ్చి వారిని బెదిరించారు. మెడపై కత్తిపెట్టి నగలు తీసుకున్నారు. క్యాబ్‌ డ్రైవర్ నుండి ఏటిఎం కార్డ్‌ని గుంజుకున్నారు. వారిలో ఒక దొంగ ఏటిఎం సెంటర్‌కు వెళ్లి ఖాతాలో ఉన్న 25 వేల రూపాయలు డ్రా చేసాడు. విషయం పోలీసులకు చెప్పేస్తారేమోనన్న భయంతో ఆ మహిళను వివస్త్రను చేసి నిలబెట్టారు. 
 
నగ్నంగా ఉన్న ఆమెను వీడియో తీసారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. చేసేదేమీ లేక వారు ఒకరోజంతా మిన్నుకుండిపోయారు. ఇలా ఏమీ చేయకుండా ఉండటం కంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిదని భావించి వారు రిపోర్ట్ చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్యావుడా.. ఒరేయ్ వంకరగా... ఒసేయ్ ఆంబోతు శ్రీరెడ్డి... ఎందుకు?