Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాప్‌‌ గోల... భర్తను, కన్నబిడ్డను పట్టించుకోలేదు.. బాయ్‌ఫ్రెండ్ ఏం చేశాడంటే?

Advertiesment
యాప్‌‌ గోల... భర్తను, కన్నబిడ్డను పట్టించుకోలేదు.. బాయ్‌ఫ్రెండ్ ఏం చేశాడంటే?
, శనివారం, 13 జులై 2019 (18:41 IST)
టెక్నాలజీ కొంపముంచుతోంది. సాంకేతికతను కొందరు సానుకూలంగా వాడుకుంటుంటే.. వాటిని మరికొందరు మాత్రం బానిసగా మారిపోయి.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అదీ సోషల్ మీడియాలకు చెందిన యాప్‌ల పరిస్థితి మరింత దారుణం. తాజాగా తమిళనాడు నెల్లైకి చెందిన ఓ మహిళ యాప్‌కు బానిసగా మారి.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను.. కన్నకొడుకుకు దీన పరిస్థితిని తెచ్చిపెట్టింది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లైకి చెందిన దివ్య, తిరుచ్చికి చెందిన మహేష్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు కూడా వున్నాడు. కొన్నేళ్ల క్రితం దివ్య తన స్మార్ట్ ఫోన్ ద్వారా టిక్ టాక్‌తో పాటు పలు యాప్‌లను ఉపయోగించడం మొదలెట్టింది. ఇలా వాటిని ఉపయోగించి.. వాటికి బానిసగా మారిపోయింది. యాప్‌ల గోలలో పడి కన్నబిడ్డను కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టింది. 
 
అశ్లీల పాటలు పాడటం, అశ్లీలంగా నటించడం చేసిన దివ్యకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. దీన్ని మహేష్ తీవ్రంగా ఖండించాడు. ఈ వ్యవహారంపై ఏర్పడిన వివాదం కారణంగా దివ్య పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకులు కూడా పంపించింది. అయితే ఇటీవల దివ్య, మహేష్ దంపతుల కుమారుడిని పాఠశాలలో దాడికి గురయ్యాడు. విచారణలో దివ్య బాయ్ ఫ్రెండ్ ఆ బాలుడిని కొట్టినట్లు తెలిసింది. 
 
దీనిపై మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకా దివ్య కుమారుడు శిశు సంక్షేమ కేంద్రంలో పెరుగుతున్నాడని.. ఈ దాడికి తర్వాత ఆ బాలుడిని దివ్య వద్ద అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానవత్వంతో స్పందించడంలో ఈటెల రాజేందర్‌కు సాటి లేరు