పదో తరగతి చదివే మరదలిపై అత్యాచారం ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆయన ఏళ్ళ తరబడి ఈ పాడుపని చేస్తూ వచ్చాడు. చివరకు ఆ బాలిక గర్భందాల్చింది. దీంతో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కరుత్తన్‌గోడుకు చెందిన అయ్యప్పన్ (30) అనే వ్యక్తి స్థానికంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా ఉంటున్నారు. ఈయన ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు.
అయితే, పదో తరగతి చదువుతున్న భార్య చెల్లెలిపై కన్నేసిన అయ్యప్పన్ ఆమెను మాయమాటలతో లోబరుచుకున్నాడు. ఆమెపై కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో అబార్షన్ చేయించేందుకు ఇటీవల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగుచూసింది.
దీంతో అయ్యప్పన్ ఆ బాలికను ఆస్పత్రిలోనే వదిలిపెట్టి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడకు వచ్చి బాలికను విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అయ్యప్పన్ కోసం గాలిస్తున్నారు.