సన్నీలియోన్‌తో సునీల్, బ్రహ్మానందం.. సూపర్ ఛాన్స్

బుధవారం, 12 జూన్ 2019 (15:10 IST)
పోర్న్ కమ్ బాలీవుడ్ సుందరి సన్నీలియోన్‌తో నటించే అవకాశాన్ని తెలుగు హాస్య నటులు సునీల్ బ్రహ్మానందం సొంతం చేసుకున్నారు. సన్నీలియోన్ మదన్నా కరిమి కాంబోలో తెరకెక్కుతున్న కొక కోలా అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో బ్రహ్మానందం, సునీల్ పాల్గొన్నారని.. తదుపరి షెడ్యూల్ నోయిడాలో జరుగనుంది. 
 
హీరోగా కొన్నాళ్ళు రాణించిన తర్వాత మళ్ళీ తన పాత ట్రాక్ అందుకుని ఇప్పుడిప్పుడే హాస్యభరిత పాత్రలు చేస్తున్నారు సునీల్. ఇప్పటికే 'అరవింద సమేత, చిత్రలహరి' సినిమాలు చేసిన ఆయన చేతిలో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒక బాలీవడు చిత్రం కూడా ఉందట. 
 
తాతినేని ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో బ్రహ్మానందం, సన్నీ లియోన్ కూడా నటిస్తున్నారు.  మరో ఇద్దరు బాలీవుడ్ కమెడియన్స్ కమ్ హీరోస్ ఇందులో ప్రధాన పాత్రలు చేస్తున్నారట. ఇదే సునీల్ చేస్తున్న మొదటి హిందీ చిత్రం కావడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాత మహేంద్ర ధరివాల్ ధ్రువీకరించారు. ఇంకా ఈ సినిమా సెట్స్‌లోకి బ్రహ్మానందం, సునీల్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 
 
కామెడీకి మాస్టర్ల వంటి వారు తమ సినిమాలో భాగం కావడం సంతోషంగా వుందని చెప్పారు. ఇకపోతే.. మమ్ముట్టి మధుర రాజాలో స్పెషల్ అపీరియన్స్‌గా రంగీలా అనే పూర్తి మలయాళ సినిమాలో సన్నీ నటిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఈ హాట్ డ్యాన్స్ ఏంటో గానీ.. వీడియో వైరల్.. ఎవరిది?? (Video)