Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్మశానంలో పది కోట్ల విలువ చేసే బంగారం ఎలా వచ్చింది..?

శ్మశానంలో పది కోట్ల విలువ చేసే బంగారం ఎలా వచ్చింది..?
, మంగళవారం, 21 డిశెంబరు 2021 (18:41 IST)
శ్మశానంలో శవాల దిబ్బలుంటాయని విని వుంటాం. కానీ ఇక్కడ భారీగా ఆభరణాలు లభించాయంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. తమిళనాడు వెల్లూరులోని ఓ నగల దుకాణంలో 15కిలోల బంగారం దోచుకెళ్లిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ ద్వారా దోచుకోవడం నేర్చుకుని చోరీకి పాల్పడ్డాడు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు ఖంగుతిన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. వెల్లూరులోని ఓ నగల దుకాణంలో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు.. ఐదు రోజుల పాటు ముమ్మరంగా గాలించి చివరకు పట్టుకున్నారు. డిసెంబర్ 15న అలుక్కాస్ జ్యువెలరీ షాపులో దోపిడీ జరిగింది. 
 
ఈ ఘటనలో 15 కిలోల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు దొంగలు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సింహం ముసుగు ధరించి, స్ప్రే పెయింట్ ద్వారా సీసీటీవీ కెమెరాల రికార్డింగ్‌ను ఆపేందుకు ప్రయత్నించి దోపిడీకి పాల్పడినట్లు కనిపించింది.
 
పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఈ దోపిడికి సంబంధించి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో  నిందితుడిని కూచిపాళయం గ్రామానికి చెందిన 22 ఏళ్ల తిఖారామ్‌గా గుర్తించారు.
 
నిందితుడిని ప్రశ్నించగా.. యూట్యూబ్‌లో వీడియో చూసి తిఖారామ్ దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేశాడని తెలియడంతో పోలీసులు ఖంగుతిన్నారు. టీఖారామ్ బంగారాన్ని కరిగించే యంత్రాలను కూడా కొనుగోలు చేసి ఒడుకత్తూరు శ్మశాన వాటికలో దాచాడు. దాచిన బంగారాన్ని కూడా శ్మశానంలో దాచేవాడు. 
 
త్వరగా సంపన్నుడు కావాలనుకున్న తిఖారామ్ ప్లాన్ బయటపడటంతో పోలీసుల వలలో చిక్కుకున్నాడు. అతని వద్ద నుంచి దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు లభ్యమయ్యాయి. అతనిపై ఐపీసీ 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో ఆ సిరప్ తాగి ముగ్గురు చిన్నారుల మృతి.. కోటి కావాలని డిమాండ్