Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డీఎంకేకు షాక్ : బీజేపీలో చేరిన మరో డీఎంకే ఎమ్మెల్యే

Advertiesment
డీఎంకేకు షాక్ : బీజేపీలో చేరిన మరో డీఎంకే ఎమ్మెల్యే
, సోమవారం, 15 మార్చి 2021 (09:50 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. ఇప్పటికే థౌజెండ్‌ లైట్స్‌ నియోజకవర్గం డీఎంకే ఎమ్మెల్యే కె.కె. సెల్వం భాజపాలో చేరగా.. తాజాగా అదే పార్టీకి చెందిన తిరుప్ప నియోజకవర్గం ఎమ్మెల్యే పి.శరవణన్‌ ఆదివారం భాజపా తీర్థం పుచ్చుకున్నారు. 
 
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ఎల్‌. మురుగన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. జిల్లా స్థాయి పార్టీ కార్యవర్గాల ఆధిపత్యం.. వేధింపుల కారణంగానే తాను డీఎంకే పార్టీని వీడుతున్నట్లు శరవణన్‌ తెలిపారు. 
 
కొన్నేళ్ల కిందట భాజపాలోనే ఉన్న ఆయన ఆ తర్వాత డీఎంకేలో చేరారు. 2019లో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలని చూస్తోన్న తరుణంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో పార్టీ వర్గాలు కలవరపడుతున్నాయి. 
 
కాగా, శరవణన్ పార్టీ వీడటానికి మరో కారణం ఉంది. కూటమి పొత్తుల్లో భాగంగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాన్ని మిత్రపక్షాలకు కేటాయించారు. దీంతో ఈ దఫా తనకు పోటీ చేసే అవకాశం రాదని గ్రహించిన శరవణన్ ముందు జాగ్రత్తగా బీజేపీ కండువా కప్పుకుని, ఇపుడు మళ్లీ బరిలోకి దిగుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగరాల్లో ఫ్యాను జోరు... 13 జిల్లాల్లో 11 కార్పొరేషన్లు కైవసం