Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాకింగ్... కరెంట్ బిల్లు చూసి ఆత్మహత్య చేసుకున్నాడు

కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్న ఓ చిరు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కనీసం ఎలక్ట్రిసిటీ కార్యాలయానికి వెళ్లి వివరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బిల్లును చూసిన వెంటనే ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఔరంగాబాదులోని

Advertiesment
షాకింగ్... కరెంట్ బిల్లు చూసి ఆత్మహత్య చేసుకున్నాడు
, శుక్రవారం, 11 మే 2018 (18:54 IST)
కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్న ఓ చిరు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కనీసం ఎలక్ట్రిసిటీ కార్యాలయానికి వెళ్లి వివరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బిల్లును చూసిన వెంటనే ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఔరంగాబాదులోని భరత్ నగర్లో చోటుచేసుకుంది. 
 
భరత్ నగరుకు చెందిన 40 ఏళ్ల జగన్నాథ్ షెల్కేది కూరగాయల వ్యాపారం. ఎప్పుడూ వచ్చే మాదిరిగా కరెంట్ బిల్లు వచ్చింది. ఐతే ఆ బిల్లులోని అంకెలను చూసి జగన్నాథ్ షాకయ్యాడు. ఏకంగా రూ. 8,64,781లు కరెంట్ బిల్లు అయినట్లు అందులో వుంది. దీన్ని చూసిన సదరు వ్యక్తి ఇక ఆ బిల్లు కట్టడం తన వల్ల కాదనుకున్నాడు. 
 
నిజానికి 6,117.8 కేడబ్ల్యూహెచ్‌కు బదులుగా 61,178 కేడబ్ల్యూహెచ్ అని ఎంటర్ చేయడంతో బిల్లు అంత మొత్తం వచ్చింది. ఐతే బిల్లు గురించి వాకబు చేయకుండా వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ తప్పు చేసిన విద్యుత్ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థినిని పెళ్లాడిన హెడ్ మాస్టర్.. 13ఏళ్ల బాలుడితో 23 ఏళ్ల యువతి వివాహం.. ఎక్కడ?