అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు తమ పార్టీలో చోటు లేదని తమిళనాడు సీనియర్ మంత్రి జయకుమార్ పేర్కొన్నారు.
శశికళ వ్యవహారంలో ఇదివరకే అన్నాడీఎంకే అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం అలాగే కొనసాగుతుందన్నారు. ఆమె జైలు నుంచి ఎప్పుడు విడుదలైనా పార్టీలో చోటులేదని, ఒక కుటుంబం మినహాయించి మిగతా వారంతా అన్నాడీఎంకేలో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
అయితే మరో సీనియర్ మంత్రి ఓఎస్ మణియన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. శశికళ పార్టీలో చేరడంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.