Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓల్డ్ హుబ్లీ స్టేషన్‌పై రాళ్ళదాడి... టియర్ గ్యాస్ ప్రయోగం

hubli police station
, ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (17:53 IST)
కర్నాటక రాష్ట్రంలోని పాత హుబ్లీ పోలీస్ స్టేషన్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఓ వాట్సాప్ స్టేటస్ కారణంగా అర్థరాత్రి పూట కొందరు వ్యక్తులు స్టేషన్ వద్దకు చేరుకుని దాడికి దిగారు. 
 
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అభ్యంతరకర రీతిలో వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో కొన్ని అల్లరి మూకలు ఏకంగా పోలీసు స్టేషన్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన సమయంలో ఇన్‌స్పెక్టర్‌తో సహా పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. వారందరూ ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రాళ్ల దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలపై సైతం రాళ్లతో దాడి చేశారు. 
 
ఈ దాడి కారణంగా పరిస్థితి చేయదాటిపోతుందని భావించిన పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. అలాగే, హుబ్లీ నగర వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అటు ఢిల్లీలో కూడా హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా కొందరు రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలులో హనుమాన్ శోభాయాత్ర హింసాత్మకం