Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నమ్మ జైలు నుంచి వచ్చేస్తోందట.. అన్నాడీఎంకేలో మళ్లీ లుకలుకలు..?

Advertiesment
చిన్నమ్మ జైలు నుంచి వచ్చేస్తోందట.. అన్నాడీఎంకేలో మళ్లీ లుకలుకలు..?
, బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (13:54 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళ కర్ణాటక జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె.. ఆ రాష్ట్ర జైళ్ల శాఖ నిబంధనల ప్రకారం విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
 
సాధారణంగా స్వల్పకాల శిక్షకు గురైన వారు మూడోవంతు శిక్షను పూర్తి చేసుకుంటే ఆపై ఎప్పుడైనా విడుదల కావచ్చు. ఈ నిబంధనల ప్రకారం. జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్షకు గురైంది. దీని ప్రకారం చిన్నమ్మకు శిక్షాకాలం 2021తో పూర్తవుతుంది. 
 
అయితే, సత్ప్రవర్తన, రాష్ట్ర చట్టాల ప్రకారం, ఆమె శిక్షాకాలం ముగియకుండానే బాహ్య ప్రపంచంలోకి శశికళ వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈమెతో పాటు ఇళవరసి, సుధాకరన్‌లు కూడా మూడేళ్ల జైలు శిక్ష ముగియకుండానే విడుదల అవుతారని జాతీయ మీడియా కోడైకూస్తోంది. 
 
అయితే, శశికళకు జైలుశిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానాను కూడా సుప్రీంకోర్టు ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని ఇప్పటివరకు శశికళ చెల్లించలేదు. జరిమానా డబ్బు కోసం ఆమె ఆస్తులను జప్తు చేసేందుకు తమిళనాడు సర్కారు ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ‌న‌సేన ఆశావహుల దరఖాస్తుల పరిశీలనకు విధివిధానాలు