Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోద్రాలో 56మందిని వాళ్లు చంపితే మేం 2 వేలమందిని బొందలోపెట్టాం: ఆరెసెస్‌ నేతపై వేటు!

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన ఆరెస్సెస్ కీలక నేత చంద్రావత్‌ను సంస్ధ నుంచి బహిష్కరించడం గురించి ఆరెస్సెస్ ఆలోచిస్తోందా? ఒక రాష్ట్రముఖ్యమంత్రి హత్యకు కోటి రూపాయల సుపారీ ఇస్తానని బహిరంగ

Advertiesment
గోద్రాలో 56మందిని వాళ్లు చంపితే మేం 2 వేలమందిని బొందలోపెట్టాం: ఆరెసెస్‌ నేతపై వేటు!
హైదరాబాద్ , శుక్రవారం, 3 మార్చి 2017 (02:41 IST)
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన ఆరెస్సెస్ కీలక నేత చంద్రావత్‌ను సంస్ధ నుంచి బహిష్కరించడం గురించి ఆరెస్సెస్ ఆలోచిస్తోందా? ఒక రాష్ట్రముఖ్యమంత్రి హత్యకు కోటి రూపాయల సుపారీ ఇస్తానని బహిరంగంగా ప్రకటించిన చంద్రావత్‌కు ఎంత దూరం పాటిస్తే అంత మంచిదిని ఆరెస్సెస్ అధినాయకత్వం నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
కేరళళో ఆరెస్సెస్ కార్యకర్తలను ఊచకోత కోస్తున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తల నరికి ఎవరైనా నా ముందు పెడితే కోటిరూపాయల కంటే విలువైన నా ఆస్తిని అమ్మి ఆ పనిచేసిన వాళ్లకు ఇస్తానని ఉజ్జయని సహ ప్రచార్ ప్రముఖ్ కుందన్ చంద్రావత్ ఒక బహిరంగ సభలో ప్రకటించడం ప్రకంపనలు సృష్టించింది. ఈ వ్యాఖ్యల తీవ్రతను గమనించిన ఆరెస్సెస్ వెంటనే ఆ ప్రకటనను ఖండించింది. ఆరెస్సెస్‌కు చెందిన అఖిల భారతీయ సహ ప్రచార్ ప్రముఖ్ జె. నందకుమార్ వెంటనే నష్టనివారణకు ప్రయత్నించారు. 
 
ఉద్రేకంలో డాక్టర్ కుందన్ చేసిన ప్రకటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ప్రకటన సంఘ్ అధికార ప్రకటన కాదు. తొలినుంచి ఆరెస్సెస్ సామాజిక సేవ, మానవ వనరుల నిర్మాణంలో పాలుపంచుకోవడంపైనే దృష్టి పెడుతోంది. హింసను సంస్థ ఎన్నడూ విశ్వసించలేదు. హింసకు పాల్పడలేదు. ప్రజాస్వామిక పద్ధతులలో నిరసన తెలపడంపై మాత్రమే సంఘ్‌కు విశ్వాసం ఉంది అని నందకుమార్ ప్రకటించారు. 
 
మార్చి 1-3 తేదీలలో కేరళలో మార్క్సిస్టులు ఆరెస్సెస్ కార్యకర్తలపై చేసిన హత్యాకాండను దేశవ్యాప్తంగా పలు సంస్థలు నిరసిస్తూ వస్తున్నాయి. ఉజ్జయనిలో జరిగిన అలాంటి కార్యక్రమంలో కేరళ ఘటన గురించి చంద్రావత్ దృష్టికి వచ్చినట్లుంది. తన వ్యక్తిగత స్థాయిలో చంద్రావత్ కేరళ సీఎంపై వివాదాస్పద ప్రకటన చేశారు. విభిన్న సంస్థలు పాల్గొంటున్న నిరసన కార్యక్రమాల్లో వివిధ వ్యక్తులు ప్రకటనలు చేస్తుంటారు. అలాంటి ప్రకటనలు ఆరెస్సెస్ అధికార ప్రకటనలుగా భావించకూడదు అని నందకుమార్ పేర్కొన్నారు.
 
ఉజ్జయినిలో జన్ అధికార్ సమితి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కుందన్ చంద్రావత్ కేరళ సీఎంపైనే కాకుండా గోద్రా అల్లర్లను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గ్రోద్రా ఘటనలో వాళ్లు (ముస్లింలు) 56 మందిని చంపారు. మేం వాళ్లలో 2 వేలమందిని కబర్‌స్తాన్ పంపించాం అని 2002లో జరిగిన గోద్రా అల్లర్ల గురించి చంద్రావత్ ప్రస్తావించారు. ఈ విషయం ఆరెస్సెస్ అధినాయకత్వం దృష్టికి రాగానే సంస్థ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఉజ్జయనిలోని సంస్థ ప్రచార్ ప్రముఖ్ చంద్రావత్ సంస్థకు చెడ్డపేరు తెచ్చారు. సంఘ్ పాటిస్తున్న మౌలిక సంస్కృతికి ఇది వ్యతిరేకం. అతడిపై కఠిన చర్య తీసుకుంటాం. అతడిని సంస్థనుంచి ఉద్వాసన పలికినా ఆశ్చర్యపడాల్సింది లేదు అని ఆరెస్సెస్ వర్గాలు తెలిపాయి. 
 
కానీ ఆరెస్సెస్ తన ప్రచార్ ప్రముఖ్‌పై చర్యలు ఏవీ తీసుకోకముందే సీపీఐఎం కేంద్రకమిటీ డాక్టర్ చంద్రావత్ ప్రకటను తీవ్రంగా ఖండించడం, ఆరెస్సెస్ను, కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేయడం  జరిగిన నేపధ్యంలో కేరళలో నిప్పు అంటుకుంది. గురువారం రాత్రి కేరళలోని త్రివేండ్రంలో సీపీఐఎం కార్యకర్తలుగా భావిస్తున్నవారు అక్కడి ఆరెస్సెస్ కార్యాలయంపై బాంబు దాడి చేసి  అయిదుగురు కార్యకర్తలను తీవ్రంగా గాయపర్చడం షాక్ కలిగించింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా సీఎం హత్యకు సుఫారీ ఇస్తారా.. అట్టుడుకుతున్న కేరళ: ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి!