Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా సీఎం హత్యకు సుఫారీ ఇస్తారా.. అట్టుడుకుతున్న కేరళ: ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి!

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపితే కోటి రూపాయులు సుపారీ ఇస్తానని మరో రాష్ట్రానికి చెందిన ఆరెస్సెస్ నేత చేసిన ప్రకటనతో కేరళ అట్టుడికిపోయింది. గత కొంతకాలంగా సీపీఎం, ఆరెస్సెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగుతున్న కేరళలో ఆరెస్సెస్ నేత ప్రకటన ప్రకంపనలు

మా సీఎం హత్యకు సుఫారీ ఇస్తారా.. అట్టుడుకుతున్న కేరళ:  ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి!
హైదరాబాద్ , శుక్రవారం, 3 మార్చి 2017 (01:28 IST)
దేశాన్ని దిగ్భ్రాంతి పరిచిన ఘటనలు కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపితే కోటి రూపాయులు సుపారీ ఇస్తానని మరో రాష్ట్రానికి చెందిన ఆరెస్సెస్ నేత చేసిన ప్రకటనతో కేరళ అట్టుడికిపోయింది. గత కొంతకాలంగా సీపీఎం, ఆరెస్సెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగుతున్న కేరళలో ఆరెస్సెస్ నేత ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. సీఎం హత్యకు కోటి రూపాయల సుపారీని ఆసెస్సెస్ నేత ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ రాష్ట్ర సీవీఎం కార్యకర్తలు ఆరెస్సెస్ కార్యాలయంపై బాంబు దాడి చేసి అయిదుగురిని తీవ్రంగా గాయపర్చారు. 
 
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఎవరైనా చంపితే, వాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే కొచ్చి కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. నాదపురం సమీపంలోని కళ్లాచీలో గురువారం రాత్రి జరిగిన ఈ బాంబు దాడిలో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
సీఎం విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తి మొత్తం అమ్మేస్తానని కూడా ఉజ్జయినిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్‌గా పనిచేస్తున్న చంద్రావత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బాంబు దాడి కచ్చితంగా సీపీఎం కార్యకర్తల పనే అని ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తోంది. కొంతకాలంగా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విమర్శించారు.
 
ఇప్పటికే ఎంతోమంది తలల్ని తీశారు: సీఎం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఎవరైనా చంపితే, వాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చంద్రావత్ వ్యాఖ్యలను సీపీఎం నాయకులు ఖండించారు.  కేరళ సీఎం విజయన్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఎంతో మంది తలలను తీసుకుందని అన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. చంద్రావత్ వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ చింతామణి మాలవీయ, ఎమ్మెల్యే మోహన్ యాదవ్‌ల సమక్షంలో చంద్రావత్ మాట్లాడుతూ.. విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తి మొత్తం అమ్మేస్తానని చెప్పారు.
 
ఆ సీఎంను చంపితే.. కోటి ఇస్తా: ఆర్ఎస్ఎస్ నేత
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఎవరైనా చంపితే, వాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ అన్నారు. విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తి మొత్తం అమ్మేస్తానని కూడా ఉజ్జయినిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్‌గా పనిచేస్తున్న చంద్రావత్ చెప్పారు. ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఎంపీ చింతామణి మాలవీయ, ఎమ్మెల్యే మోహన్ యాదవ్‌ల సమక్షంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 
కేరళలో చాలా కాలంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులకు, సీపీఎం నాయకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గత నెలలో బీజేపీ నాయకుడు సంతోష్ మరణంతో.. విజయన్ అధికారం చేపట్టినప్పటి నుంచి మొత్తం ఎనిమిది మంది బీజేపీ నాయకులు మరణించినట్లయింది. దేశాన్ని చీల్చేందుకు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కుట్ర పన్నుతున్నాయని గతవారం జరిగిన ఓ సమావేశంలో సీఎం విజయన్ వ్యాఖ్యానించారు. హిట్లర్, ముస్సోలినిలను ఆర్ఎస్ఎస్ అనుసరిస్తోందని.. వాళ్లిద్దరూ ప్రపంచాన్నే వణికించిన నియంతలని ఆయన అన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే కూడా ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఆయుధమేనని చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాళ్ళని చేతులని నరికి తింటున్నాడు