Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ శ్వేతవర్ణపు జింకను చూస్తే అదృష్టమేనట! (Video)

Advertiesment
Albino Deer

ఠాగూర్

, మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (13:58 IST)
సాధారణంగా గోధుమ వర్ణంలో ఉన్న జింకలను చూస్తుంటాం. కానీ, తెలుపు రంగులో ఉన్న జింకను మీరెప్పుడైనా చూశారా? ఇలాంటి ఓ జింక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. మంచు ప్రాంతంలో ఈ అరుదైన జింకను ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేశారు. అయితే, 30 వేల కంటే ఎక్కువ జింకల జననంలో ఇలాంటి ఒక తెలుపు వర్ణపు జింకలు జన్మిస్తుంటాయని జువాలజిస్టులు చెబుతున్నారు. ఇలాంటి జింకను చూస్తే అంతా మంచే జరుగుతుందని అమెరికన్లు విశ్వసిస్తుంటారు.
 
ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఈ తెల్లటి జింక నిలబడి ఉండటం చూసిన ఓ మహిళ దాన్ని తన కెమెరాలో బంధించారు. ఆ తర్వాత ఆ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ తర్వాత ఎక్స్ ఖాతాలో షేర్  చేశారు. 
 
"అద్భుతంగా ఉంది. ఈ జింక గులాబీ రంగు కళ్లను బట్టి నిజమైన అల్బినో అని చెప్పగలం. ఆ సందర మనోహర దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం" అని ఆమె టిక్‌టాక్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోను చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. అయితే, ఈ అరుదైన జింకను ఆమె ఎక్కడ చూశారో చెప్పలేదు. 
 
ఇకపోతో అల్బినో జింకలు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రతి లక్ష జింకల్లో ఒకటి మాత్రమే ఇలా శ్వేతవర్ణంలో ఉంటుంది. నిజమైన అల్బినో జింకలలను మెలనిన్ పూర్తిగా ఉండదు. ఫలితంగా స్వచ్ఛమైన తెల్లటి బొచ్చు, విలక్షణమైన గులాబీ కళ్లు ఉంటాయి. కాగా, గత 2023లో కర్నాటకలోని కాబిని అడవిలో వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ ధృవ్ పాటిల్ ఇలాగే ఒక అరుదైన అల్బినో జింకను ఫోటో తీసి షేర్ చేసిన విషయం తెల్సిందే. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ