ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్‌నాథ్ సింగ్? నేడు అమిత్ షా కీలక ప్రకటన
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నియమితులు కానున్నారు. ఇదే అశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం కీలక ప్రకటన చేయనున్నారు. ఇటీవల వెల్లడైన ఉత్తరప్రదేశ్ రాష్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నియమితులు కానున్నారు. ఇదే అశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం కీలక ప్రకటన చేయనున్నారు. ఇటీవల వెల్లడైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లను గెలుచుకుని ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.
అయితే, యూపీ సీఎం పీఠం కోసం బీజేపీ ఎంపీ ఆదిత్యానాథ్, రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, లఖ్‌నవ్ మేయర్ దినేశ్ శర్మ, యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ ప్రసాద్ మౌర్య, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్ గాంగ్వార్, రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత స్వతంతర్‌దేవ్, మహరాజ్‌పూర్ నుంచి 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సతీశ్ మహానా పేర్లు కూడా పోటీలో ఉన్నాయి.
ఇందరిపేర్లూ జాబితాలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా రాజ్‌నాథ్‌కే పట్టం కడతారని బీజేపీ వర్గాల సమాచారం. బుధవారం లఖ్‌నవ్‌లోని సీఎం అధికార నివాసంలో కేంద్ర హోంశాఖ అధికారులు రెక్కీ నిర్వహించడం ఈ వాదనని బలపరుస్తోంది. ఒక పర్యాయం యూపీ సీఎంగా పని చేసిన అనుభవంతోపాటు, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసిన నేపథ్యం, యూపీ ప్రజల నాడి తెలిసి ఉండటం, అన్నివర్గాలతో రాజ్‌నాథ్‌కు సత్సంబంధాలు ఉండటం వంటి అంశాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకొన్నట్టు తెలుస్తోంది.
అయితే, ఈ వార్తల్లో నిజం లేదని రాజ్‌నాథ్ కొట్టిపడేశారు. తాను సీఎం రేసులో ఉన్నాననడంలో అర్థమే లేదని ఒక మీడియాకు ఇచ్చిన సమాధానంలో అన్నారు. యూపీ సీఎంని ఎంపిక చేసే బాధ్యతని బీజేపీ పార్లమెంటరీ బోర్డు.. అమిత్‌షాకు అప్పగించగా, ఆయన గురువారం కీలక నిర్ణయాన్ని వెలువరించనున్నారు. ఆ మరునాడే కొత్త సీఎం పీఠం ఎక్కుతారు.