గుజరాత్‌లో గోవులను వధించినా.. గోమాంసం రవాణా చేసినా జీవితఖైదు
గుజరాత్ రాష్ట్రంలో గోవధ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తామని, అప్పటికీ గోవులను వధిస్తే జీవిత శిక్ష విధించేలా చట్టాలన్ని తీసుకుని రానున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు.
గుజరాత్ రాష్ట్రంలో గోవధ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తామని, అప్పటికీ గోవులను వధిస్తే జీవిత శిక్ష విధించేలా చట్టాలన్ని తీసుకుని రానున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గుజరాత్‌లో గోవులను వధించినా, ఆవు మాంసాన్ని రవాణా చేసిన జీవిత ఖైదు విధించేలా చట్టం తీసుకువస్తామన్నారు.
గోవుల సంరక్షణకు కఠినచర్యలు తీసుకుంటామన్నారు. 2011వ సంవత్సరంలో గోవుల సంరక్షణకు ప్రవేశపెట్టిన చట్టంపై సుప్రీంకోర్టులో పోరాడతామని రూపానీ చెప్పారు. ఆవు మాంసాన్ని రవాణా చేసే వాహనాలను శాశ్వతంగా సీజ్ చేసేలా చట్టం తీసుకువస్తామన్నారు. గుజరాత్ రాష్ట్రప్రభుత్వం 2011లో తీసుకువచ్చిన గో సంరక్షణ చట్టానికి మార్పులు తీసుకువచ్చి కఠినశిక్షలు పడేలా చూస్తామని సీఎం రూపానీ వివరించారు.