Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అచ్చెన్నాయుడు కొట్టారు.. చంద్రబాబును కలవనివ్వలేదు.. అందుకే ఆత్మహత్యాయత్నానికి?

శ్రీకాకుళంకు చెందిన కళ్యాణి అనే యువతి అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నేపథ్యంలో.. ఆమె వద్ద మీడియా సేకరించిన వివరాలను బట్టి చూస్తే.. రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు తనను కొట్టారని కళ్యాణి సెన

అచ్చెన్నాయుడు కొట్టారు.. చంద్రబాబును కలవనివ్వలేదు.. అందుకే ఆత్మహత్యాయత్నానికి?
, గురువారం, 16 మార్చి 2017 (11:06 IST)
శ్రీకాకుళంకు చెందిన కళ్యాణి అనే యువతి అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నేపథ్యంలో.. ఆమె వద్ద మీడియా సేకరించిన వివరాలను బట్టి చూస్తే.. రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు తనను కొట్టారని కళ్యాణి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. అధికారుల తీరుపై టెక్కలి సీఐ, ఎస్ఐలకు ఫిర్యాదు చేస్తే.. కేసును పట్టించుకోకపోగా.. వారే తనను లైంగికంగా వేధించారని కళ్యాణి వ్యాఖ్యానించారు. 
 
తన సమస్యలపై సీఎం చంద్రబాబుకు విన్నవించుకోవడానికి వచ్చిన కళ్యాణిని సిబ్బంది ఆపడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మాహత్యాయత్నం తర్వాత ఆమెను మంగళగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించిన సిబ్బంది.. ఆ తర్వాత రాత్రి 7గం. సమయంలో ఆమెను బలవంతంగా రైల్లో సొంత ఊరికి తరలించారు. అయితే ఆసుపత్రిలో పలువురు మీడియా ప్రతినిధులు వివరాలు సేకరించారు. 
 
తన తండ్రి కూరపాని అప్పారావు ఆర్అండ్‌బీ శాఖలో రోడ్ రోలర్ డ్రైవర్ గా పనిచేస్తూ మృతిచెందడంతో..ఆయన స్థానంలో అదే శాఖలో తనకు అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చినట్లు కళ్యాణి చెప్పారు. ఇటీవల పదోన్నతి కోసం ప్రయత్నిస్తూ ఉన్నతాధికారులకు తన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ సమర్పించగా.. పదో తరగతి సర్టిఫికెట్ నకిలీదని తనపై ఆర్అండ్‌బీ అధికారులు కేసు పెట్టారని పేర్కొన్నారు. 
 
గతంలో సీఎం చంద్రబాబు సమస్య గురించి విన్నవించినప్పుడు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని.. కానీ ఆపై పోలీసులు ఆర్అండ్‌బీ అధికారులు వేధింపులు ఎక్కువైపోయాయని కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై బాబుకు చెప్పాలనుకుంటే.. సిబ్బంది అనుమతించలేదని అందుకే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8పై గుడ్ న్యూస్: మార్చి 29న రిలీజ్‌కు సన్నాహాలు