Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊరిలో చిచ్చుపెట్టిన కోడి.. 34 మందిపై కేసు

Advertiesment
ఊరిలో చిచ్చుపెట్టిన కోడి.. 34 మందిపై కేసు
, ఆదివారం, 24 మార్చి 2019 (14:17 IST)
ఓ కోడి రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. అది చివరకు ఊరికి పాకింది. ఫలితంగా ఆ ఊరిలో ఏకంగా 34 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోడి ఏంటి.. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం ఏంటనే కదా మీ సందేహం.. అయితే, ఈ కథనాన్ని చదవండి. 
 
ఓ కోడి రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. అసలే రెండు కుటుంబాల మధ్యా గతం నుంచి గొడవలు జరుగుతున్న క్రమంలో వారి వైరానికి ఓ కోడి మరింత అగ్గి రాజేసింది. దీంతో నానా రచ్చ అయిపోయింది. ఇది రాయచూరి యరగేనా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరికి సమీపంలో ఉన్న యురగేనా పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజనగేరా గ్రామంలో తిమ్మప్ప, నరసప్పబలప్ప కుటుంబీకులు రక్త సంబంధీకులు. వీరి కుటుంబాల మధ్య ఏనాటి నుంచో పొలం విషయంలో పాత కక్షలుగా ఉన్నాయి. ఈ క్రమంలో వారి ఇళ్ల మధ్య ఒకరికి చెందిన దిబ్బకుప్పను మరో ఇంటికి చెందిన కోడి కెలికింది(దువ్వింది). ఇంకేముందు ఆ రెండు కుటుంబాల మధ్య అగ్గిరాజుకుంది. 
 
ఫలితంగా ఘర్షణపడ్డారు. రెండు కుటుంబాలకు చెందినవారు కొట్టుకున్నారు. ఈ కొట్లాటను ఆపేందుకు వెళ్లినవారిపై కూడా వారు దాడికిదిగారు. అంతటితో ఊరుకోలేదు.. ఏకంగా మారణాయుధాలతో దాడులు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. రెండు కుటుంబాల వారికి సర్ధి చెప్పి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 
 
కానీ వారి మధ్య మాత్రం పూర్తిస్థాయి సమోధ్య కుదరలేదు. గొడవలు జరుగుతుండటంతో యరగేరా పోలీస్‌స్టేషన్‌లో రెండు కుటుంబాలకు చెందిన వారితో పాటు గ్రామంలో మొత్తం 34 మందిపై కేసు నమోదు చేశారు. ఘర్షణలో తీవ్రంగా గాయాలు పాలైన 9 మందిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయి : చిన్నకృష్ణ