Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కురచ దుస్తులు ఎలా ధరిస్తావ్... ఇద్దరు మగాళ్ళతో ఎలా తిరుగుతున్నావ్... పూణె యువతికి వేధింపులు!

Advertiesment
Pune
, సోమవారం, 9 మే 2016 (16:25 IST)
అమ్మాయిలకు వేధింపులు అధికమైపోతున్నాయి. ఇంత కురచ దుస్తులు ఎలా ధరిస్తావ్... ఇద్దరు మగాళ్ళతో ఎలా తిరుగుతున్నావ్... అంటూ ఓ యువతికి పూణెలో కొంతమంది యువకుల గ్యాంగ్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఆ యువతిని కారులో నుంచి బయటకు లాగి.. గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
పుణెకు చెందిన 23 యేళ్ల యువతి తన తన స్నేహితురాలి వివాహ కార్యక్రమానికి ముందు జరిగే సంగీత్‌లో పాల్గొనేందుకు డాన్స్ రిహార్సల్స్ కోసం తెల్లవారుజామున 5.30 గంటలకు కారులో ఇద్దరు స్నేహితులతో కలిసి బయలుదేరింది. ఆ సమయంలో ఆ కారు వెనుకే మరో కారు ఫాలో అయింది. ఆ కారులోని వ్యక్తులు ఆమె కారును అడ్డుకుని కారు డోర్ కొట్టారు. అందులోకి తొంగిచూశారు. పరుషపదజాలంతో హెచ్చరికలు చేశారు. 
 
'ఎలా నువ్వు ఇంత కురచ దుస్తులు వేసుకుంటావు? ఈ సమయంలో ఇద్దరు మగాళ్లతో ఎలా తిరుగుతున్నావు? ఇలాంటివన్నీ పుణెలో నడవవు' అంటూ ఆ యువతుని ఆ గ్యాంగ్ హెచ్చరించింది. అంతటితో ఆగని ఆ ఆగంతకులు ఆ యువతిని కారులోంచి బయటకు లాగి... దాడి చేసి... గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ ఘటన ఈనెల ఒకటో తేదీన జరిగింది. ఆ యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించినా ఖాకీలు మాత్రం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదని ఆ యువతి వాపోయింది. 
 
దీనిపై ఆ యువతి స్పందిస్తూ... తన స్నేహితులే ఆ సమయంలో లేకుండా ఉంటే ఆగంతకులు తనపై లైంగిక దాడి చేసి ఉండేవారని బాధితురాలు వాపోయింది. తన శరీరంపై ఉన్న గాయాలను కూడా చూపించింది. ఆరోజు డయిల్ 100కి తాను ఫోన్ చేసినా ఎవరూ సమాధానమివ్వలేదని, గంట తర్వాత పోలీసులు వచ్చారని ఆమె తెలిపింది. తాను గట్టిగా పట్టుబట్టడంతో వారం రోజుల తర్వాత కేసు నమోదు చేశారని చెప్పింది. కాగా, ఈ కేసులో అమిత్ ముఖేడ్కర్, సుభం గుప్తా అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా కోసం మరో ఉద్యమం తప్పదు : హీరో శివాజీ