ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మీట్ తర్వాత మసీదుల్లో విదేశీయులను దాచివుంచిన ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. జమాతేకు చెందిన ఇండోనేషియా, థాయ్‌లాండ్ పౌరులను మసీదుల్లో దాచిపెట్టారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు.
ఏడుగురు ఇండొనేషియా, 9 మంది థాయ్‌లాండ్ పౌరులను అరెస్టు చేశారు. అంతేకాదు వీరికి సహకరించిన 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ సహా మొత్తం 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
జమాతే సభ్యులను దాయడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని మసీదుల్లో జమాతేకు చెందిన సభ్యులను దాచి ఉంచే అవకాశం ఉందనే కోణంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
కాగా, గత మార్చి నెలలో ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్‌లో ఓ మత సమ్మేళనం జరిగింది. ఇందులో ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో హెచ్చరికలు వచ్చినా బేఖాతరు చేస్తూ వందలాది మంది సదస్సు జరిగిన భవనంలోనే ఉండిపోయారు.