Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ... ఎలా?

దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

Advertiesment
Pranab Mukherjee
, ఆదివారం, 10 జూన్ 2018 (09:56 IST)
దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. భారతీయ జనతా పార్టీని శాసించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశం దిగ్భ్రాంతి గొలిపే సంకేతాలను పంపినట్టు తెలుస్తోంది.
 
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుండా... కాంగ్రెస్‌ కూడా ఆధిక్యం సాధించలేకపోతే ఏం జరుగుతుంది? 'సంకీర్ణ సర్కారు' తప్పని పరిస్థితే తలెత్తితే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని బరిలోకి దించేలా ఆర్ఎస్ఎస్ వ్యూహం రచించనట్టు తెలుస్తోంది. శివసేన కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేసింది. 
 
నెహ్రూ సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్న ప్రణబ్‌కు ఆరెస్సెస్‌ ఆహ్వానం అంత సులువుగా తీసుకునే పరిణామంకాదని పేర్కొంది. దీనిపై శివసేన అధికార పత్రిక 'సామ్నా' శనివారం సంపాదకీయం రాసింది. '2019 ఎన్నికల్లో ఆధిక్యతను సాధించడంలో బీజేపీ విఫలమైతే... అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ ప్రధాని కావొచ్చు' అని అభిప్రాయపడింది.
 
అలాగే, 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్' అనే బీజేపీ నినాదంతో తాము ఏకీభవించడంలేదనే సందేశాన్ని ఆరెస్సెస్‌ పంపిందనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ప్రణబ్‌కు ఆహ్వానంలో సంకేతం ఇదేనని ఓ వార్తా చానల్‌ విశ్లేషించింది. 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ను కాకుండా... వారసత్వ సారథ్యంలేని కాంగ్రెస్‌నే ఆరెస్సెస్‌ ఆకాంక్షిస్తోంది. తాము కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదని, 'గాంధీ'ల వారసత్వానికి మాత్రమే వ్యతిరేమని ఆరెఎస్సెస్‌ సంకేతాలు పంపింది' అని పంపిందని తెలిపింది. 
 
పేర్కొంది. అదేసమయంలో... ఆరెస్సెస్‌ కార్యక్రమంలో పాల్గొనడంద్వారా ప్రణబ్‌ తాను స్వతంత్రుడినని, కాంగ్రెస్తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకున్నానని చెప్పకనే చెప్పారు. ఆరెస్సెస్‌ ఆహ్వానాన్ని మన్నించడంపై కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా తప్పుపట్టినా ఆయన పట్టించుకోలేదు. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వం ఉండాలని ఆకాంక్షిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీలకు ప్రధానిగా ప్రణబ్‌ ఆమోదయోగ్యమైన అభ్యర్థి అవుతారని ఆ వార్తా చానల్‌ పేర్కొంది. మొత్తానికి ప్రణబ్ మరోమారు దేశ రాజకీయాల్లో కీలకంగా మారారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ప్రతి పల్లె తృప్తిగా వుంది... ఆనందంగా వుంది... సీఎం చంద్రబాబు