తప్పొప్పులను భేరీజు వేసుకుని 'జస్ట్ ఆస్కింగ్' అంటూ ఎవరినైనా నిగ్గదీసే నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు తన బాణాలను.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పైకి గురిపెట్టారు. కంగనా ఇప్పుడు మహారాష్ట్ర సర్కారుతో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
కంగనా రనౌత్‌కు కొందరు మద్దతు తెలియజేస్తుంటే.. మరికొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కంగనా వ్యవహార శైలిని విమర్శిస్తూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. సోషల్ మీడియాలో ప్రశ్నించే ప్రకాశ్‌రాజ్ తనదైన శైలిలో వ్యంగ్యంగా కంగనా తీరుని తప్పుపట్టారు.
'ఒక సినిమాకే కంగనా తనను రాణీ లక్ష్మీబారు అనుకుంటే పద్మావత్‌లో చేసిన దీపికా పదుకొనె, జోథా అక్బర్‌లో అక్బర్‌గా నటించిన హృతిక్, అశోక చిత్రంలో చేసిన షారూక్ ఖాన్, భగత్ సింగ్‌లో నటించిన అజరు దేవగణ్, మంగళ్ పాండేగా నటించిన ఆమిర్‌ఖాన్, మోడీగా నటించిన వివేక్ ఒబెరారు ఏమనుకోవాలి' అని ప్రశ్నించేలా ప్రకాశ్ రాజ్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. మరిప్పుడు కంగనా ప్రకాశ్‌రాజ్ సెటైర్‌కు స్పందిస్తుందా? లేక పట్టించుకోరా? అనేది చూడాలి.