Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కామెడీ సర్కస్ ఎందుకు? : బీజేపీపై ప్రియాంక సెటైర్లు

కామెడీ సర్కస్ ఎందుకు? : బీజేపీపై ప్రియాంక సెటైర్లు
, శనివారం, 19 అక్టోబరు 2019 (20:04 IST)
నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తప్పుపట్టారు. బీజేపీ నేతలు తాము చేయాల్సిన పని చేయకుండా, ఇతరులు సాధించిన విజయాలను తక్కువ చేసి మాట్లాడటం తగదని హితవు పలికారు.
 
'సొంత పనులు మానేసి ఇతరుల విజయాలను చులకల చేసి మాట్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత (అభిజీత్ బెనర్జీ) నిజాయితీగా తన పని తాను చేశారు. బహుమతి గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.

మీ (బీజేపీ నేతలు) పని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం. కామెడీ సర్కస్ చేయడం కాదు' అంటూ హిందీలో పోస్ట్ చేసిన ఓ ట్వీట్‌లో ప్రియాంక చురకలు వేశారు. ట్వీట్‌తో పాటు పండుగ సీజన్ అయినప్పటికీ సెప్టెంబర్‌లోనూ ఆటోమొబైల్ రంగంలో మందగమనం కొనసాగుతోందంటూ వచ్చిన మీడియా రిపోర్ట్‌ను కూడా ఆమె జత చేశారు.
 
ప్రముఖ ఆర్థిక వేత్త ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతి గెలుచుకోవడం అభినందనీయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ శుక్రవారంనాడు పేర్కొంటూనే, ఆయన వామపక్షవాది అంటూ తప్పుపట్టారు.

కాంగ్రెస్ పథకమైన 'న్యాయ్'ను అభిజిత్ సమర్ధించారని, అయితే భారత ప్రజలు ఆయన భావజాలాన్ని తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అభిజిత్ బెనర్జీ ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉందని, ప్రస్తుత గణాంకాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో పుంజుకునే అవకాశం లేదని విశ్లేషించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో మద్యంషాపుల కోసం మహిళల పోటీ