Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశం కోసం కఠిన నిర్ణయాలు తప్పవు.. భవిష్యత్ ఫలాలు తథ్యం : నరేంద్ర మోడీ

దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, ఈ నిర్ణయాల వల్ల భవిష్యత్‌లో మంచి ప్రయోజనాలు పొందుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది.

దేశం కోసం కఠిన నిర్ణయాలు తప్పవు.. భవిష్యత్ ఫలాలు తథ్యం : నరేంద్ర మోడీ
, మంగళవారం, 22 నవంబరు 2016 (11:34 IST)
దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, ఈ నిర్ణయాల వల్ల భవిష్యత్‌లో మంచి ప్రయోజనాలు పొందుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల మార్పిడి అంశంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమేనని.. అయితే దేశ ప్రయోజనాల దృష్టా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. 
 
తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. భవిష్యత్తులో దాని ప్రయోజనాలు పొందుతారని చెప్పుకొచ్చారు. నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుకు గల కారణాలను ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదే అని మోడీ పిలుపునిచ్చారు. 
 
మరోవైపు.. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మంగళవారం ఉభయసభలు మొదలైన వెంటనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నోట్లరద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. విపక్ష సభ్యుల నినాదాలతో ఉభయసభల్లో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంద విమానాలు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరితే ఎలా ఉంటుంది.. ఈ ఫోటో చూడండి..