వంద విమానాలు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరితే ఎలా ఉంటుంది.. ఈ ఫోటో చూడండి..
వంద విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగిరితే ఎలా వుంటుంది. అదీ ఒకే రన్‌వేపై నుంచి గాలిలోకి ఎగిరితే.. ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది కదా. అలాంటి దృశ్యాన్నే.. అమెరికాకు చెందిన ఇన్ఫోగ్రాఫిక్ జీనియస్ నికోలస్ ఫెల్
వంద విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగిరితే ఎలా వుంటుంది. అదీ ఒకే రన్‌వేపై నుంచి గాలిలోకి ఎగిరితే.. ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది కదా. అలాంటి దృశ్యాన్నే.. అమెరికాకు చెందిన ఇన్ఫోగ్రాఫిక్ జీనియస్ నికోలస్ ఫెల్టన్ తన కెమెరాలో బంధించారు. వందలాది ఫొటోలను కలగలిపి వంద విమానాలు ఎగురుతున్నట్లు సృష్టించాడు. లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో రకరకాల విమానాలు, వివిధ సమయాల్లో ల్యాండ్, టేకాఫ్ అవుతుండగా తీసిన 400 ఫొటోలను గ్రాఫిక్స్ సహాయంతో ఒక్కటి చేసి ఈ ఫోటోను రూపొందించారు.
అయితే ఈ ఫోటో వాస్తవానికి ఇంచుమించు దగ్గరగా ఉంటుందని నికోలస్ తెలిపారు. అలా ఏర్చికూర్చిన ఫొటోల్లో కొన్నింటిని 'ఫొటోవిజ్'పేరుతో పుస్తకంగా మలిచాడు. 'visualizing information through photography' అనేది ఫొటోవిజ్‌కు క్యాప్షన్‌గా పెట్టాడు. కాగా ఈ గ్రాఫిక్‌కు రూపొందించిన జీనియస్ నికోలస్ ఫేస్‌బుక్ ప్రాడక్ట్ డిజైనర్ గానూ పనిచేశాడు. ప్రపంచంలోనే టాప్-50 గ్రాఫిక్ డిజైనర్లలో ఒకడిగా నిలిచారు.