Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్‌సభలో మళ్లీ అదే రభస... పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం లోక్‌సభ ప్రారంభంకాగానే అన్నాడీఎంకే, తెరాస సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వర

లోక్‌సభలో మళ్లీ అదే రభస... పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
, గురువారం, 22 మార్చి 2018 (13:36 IST)
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం లోక్‌సభ ప్రారంభంకాగానే అన్నాడీఎంకే, తెరాస సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఏపీ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కల్పించాలంటూ తెలుగుదేశం సభ్యులు, కావేరీ అంశంపై అన్నాడీఎంకే సభ్యులు ఛైర్మన్ వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను ఏకంగా శుక్రవారానికి వాయిదా వేశారు. 
 
అయితే, లోక్‌సభ ప్రారంభమైన కేవలం 34 సెకన్లలోనే వాయిదా పడటం గమనార్హం. గంట తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో అన్నాడీఎంకే, తెరాస సభ్యులు ఆందోళన కొనసాగించారు. తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చకు సహకరించాలని స్పీకర్‌ కోరినా వారు వినిపించుకోలేదు. 
 
ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. సభ్యులు లేవనెత్తుతున్న అన్ని అంశాలపై చర్చ చేపడతామని ఆందోళన విరమించాలని కోరారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుని సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ సభలో గందరగోళం తగ్గకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం ప్రాజెక్టును ఆపాలని చూస్తారా? దేనికైనా సిద్ధమే: బీజేపికి బాబు సవాల్