Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

ఎక్కడైనా రేషన్ : ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు : విత్తమంత్రి

Advertiesment
One Nation One Ration Card
, గురువారం, 14 మే 2020 (21:35 IST)
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఒకే తరహా పన్ను విధానమైన జీఎస్టీకి శ్రీకారం చుట్టారు. అలాగే, ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం వచ్చే యేడాది మార్చి 31వ తేదీ నాటికి అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
 
కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాని మోడీ రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టారు. ఈ ప్యాకేజీ వివరాలను నిర్మలా సీతారామన్ గురువారం కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వచ్చే మార్చి కల్లా దేశం మొత్తానికి ఒకే రేషన్‌ కార్డు ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
 
రేషన్‌ కార్డులు కలిగి ఉన్నవారు 2021 మార్చి నుంచి దేశంలోని ఏప్రాంతం నుంచైనా రేషన్‌ సరుకులు పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా వలసకార్మికులు ఇతర ప్రాంతాలకు పని నిమిత్తం వెళ్లినప్పుడు రేషన్‌ తీసుకోలేకపోతున్నందున వాళ్లు చాలా నష్టపోతున్నారన్నారు. 
 
ప్రధానమంత్రి సాంకేతిక ఆధారిత వ్యవస్థ సంస్కరణలో భాగంగా తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో 23 రాష్ట్రాల్లోని 67 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని విత్త మంత్రి నిర్మలా సీతారమన్ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నదీజలాల వివాదంపై అఖిలపక్షం: సిపిఎం డిమాండ్‌