Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికను కిడ్నాప్ చేసి.. 28 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. నదిలో తోసేశారు..

చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని జైపూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఏకంగా 28 రో

Advertiesment
బాలికను కిడ్నాప్ చేసి.. 28 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. నదిలో తోసేశారు..
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (14:54 IST)
చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని జైపూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఏకంగా 28 రోజుల పాటు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను ఆదివారం సాయంత్రం ఖరస్రోస్టా నదిలో తోసేశారు.
 
అయితే నదిలో తోసేసినా ఆ బాలిక ఊపిరిని అరచేతిలో పెట్టుకుని ధైర్యంగా ఊదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని రౌట్రాపూర్ గ్రామానికి చేరుకున్న బాలిక గ్రామస్తుల సాయంతో ప్రాణాలతో బయటపడింది. 
 
గత నెల ఆగస్టు 20వ తేదీన ఆ బాలిక మధుబన్ బజార్లో స్టేషనరీ ఐటమ్స్ కొనుగోలు చేసేందుకుగాను ఇంటి నుంచి బయటికి వచ్చినట్లు గ్రామస్తులకు చెప్పింది. ఆ బాలికను నిందితులు అక్కడి నుండి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంట్లో ఆ బాలికను నిర్భంధించి గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. 
 
ఇంకా ఆదివారం సాయంత్రం ఆ బాలికను నదిలో తోసేశారు. నది నుండి ఆ బాలిక ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకొంది. గ్రామస్తుల సహాయంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు విచారణలో మామనే ఆ బాలికను కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్ రేప్...