తన ప్రియుడుతో ఏర్పడిన అక్రమ బంధాన్ని నిలబెట్టుకునేందుకు ఓ నర్సు అడ్డదారులు తొక్కింది. తనతో పాటు పనిచేసే సాటి నర్సులు స్నానం చేస్తుండగా, వీడియోలు తీసి తన ప్రియుడుకి పంపించింది. ఆ వీడియోలను చూసిన ఆ ప్రియుడు.. తన స్నేహితులకు షేర్ చేశాడు. అలా ఈ వీడియోల వ్యవహారం బయటకు లీక్ అయ్యాయి. అంతే.. వీడియోలు తీసి స్నేహితుడికి పంపిన నర్సును పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జరిగింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరుకు చెందిన అశ్విని అనే నర్సుకు ఓ రాంగ్ కాల్ ద్వారా తమిళనాడు వేల్లూర్‌కు చెందిన ప్రభు అనే చెఫ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో వారిద్దరూ ఏకాంతంగా పలుమార్లు కలుసుకున్నారు.
అయితే ఆమెకు ఇది వరకే రెండు సార్లు పెళ్లైందని, విడాకులు కూడా తీసుకుందని ప్రభుకు తెలిసింది. దీంతో అతడు ఆమెను దూరం పెట్టసాగాడు. బంధంలో రెండు సార్లు విఫలమైన ఆమె, అతడ్ని వదులుకోవటనానికి ఇష్టపడలేదు. అతడు చెప్పినట్లుగా నడుచుకునేది.
ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు పంపాలని అడిగాడు. ఆమె అలాగే పంపేది. అతడికి అవి బోర్ కొడుతున్నాయని చెప్పటంతో హాస్టల్ గదిలో తనతో పాటు ఉంటున్న తోటి ఉద్యోగులు స్నానం చేస్తునపుడు తీసిన వీడియోలను అతడికి పంపేది.
ఓ రోజు బాత్‌రూంలో స్నానం చేయటానికి వెళ్లిన ఓ సిబ్బంది అక్కడ కిటికీ దగ్గర సెల్‌ఫోన్ ఉండటం గమనించింది. దీనిపై అశ్వినిని ప్రశ్నించగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించిన అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభును కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడు చాలా వరకు నర్సుల బాత్‌రూం వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది.