Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐస్‌క్రీమ్‌లో జెర్రి... ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన మహిళకు షాక్!

ice cream box

వరుణ్

, ఆదివారం, 16 జూన్ 2024 (13:22 IST)
ఇటీవల ముంబై మహానగరంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్న కోన్ ఐస్ క్రీమ్‌లో మనిషి వేలు వెలుగు చూసింది. ఈ ఐస్ క్రీమ్‌ను ఆర్డర్ చేసింది ఓ వైద్యుడు కావడంతో అతను సులభంగా వేలిని గుర్తించాడు. ఈ షాకింగ్ ఘటన నుంచి మరిచిపోకముందే ఇదే తరహాలో మరో నిర్ఘాంతపోయే ఘటన వెలుగు చూసింది. ఎంతో ఇష్టమైన, రుచికరమైన ఐస్‌క్రీమ్ ఆరిగంచేందుక సిద్ధమై మూత తీయగా అందులే నల్ల జెర్రి కనిపించింది. ఇది ఊహించడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. కానీ, నిజంగానే జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకు చెందిన మహిళకు నిజంగానే ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. 
 
ఈ ప్రాంతానికి చెందిన దీప అనే మహిళ ఆన్‌లైన్‌లో ఐస్‌‍క్రీమ్ ఆర్డరిచ్చి తెప్పించుకుంది. అందులో నల్లజెర్రి కనిపించడంతో ఆమె షాక్‌కు గురైంది. గడ్డకట్టి చనిపోయివున్న జెర్రి మూతకు అతుక్కుని కనిపించింది. ఈ వింత అనుభవం ఈ నెల 15వ తేదీన ఎదురైంది. తన పిల్లల కోసం ఆన్‌లైన్‌ డెలివరీ ఫ్లాట్‌పామ్ ద్వారా ఓ ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కు చెందిన ఐసి క్రీమ్‌ను ఆర్డర్ చేసినట్టు ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు తిరిగి డబ్బులు చెల్లించారని పేర్కొంది. ఆ తర్వాత కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆమె పేర్కొంది. 
 
పిన్నెల్లి సోదరులపై మాచర్ల పోలీసుల రౌడీషీట్!! 
 
గత దశాబ్దకాలంగా మాచర్లలో అరాచకాలకు పాల్పడుతూ, ప్రజలను వేధిస్తూ వచ్చిన పిన్నెల్లి సోదరులపై పోలీసులు కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. ఇందులోభాగంగా, వారిపై తొలిసారి రౌడీషీట్‌ను తెరిచారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన ఏపీలో జరిగిన పోలింగ్‌ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించాడు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తపై కూడా దాడి చేశారు. ఈ అంశాలపై ఇప్పటికే ఆయనపై కేసు నమోదైవుంది. ఈ నేపథ్యంలో తాజాగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్‌ను తెరిచారు. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. 
 
ఏపీలో జరిగిన పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేట్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై తన అనుచరులతో కలిసి దాడి చేయించారు. ఈ ఘటనకు సంబంధించి ఆయనపై కేసులు నమోదుకాగా, ప్రస్తుతం బెయిలుపై బయటవున్నారు. తాజాగా పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్ తెరిచినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంగా నదిలో మునిగిన బోటు... ఆరుగురు గల్లంతు!!