Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్ళెదుటే ప్రియుడు తండ్రిని చంపేసినా ఏం కాలేదులే అన్న కుమార్తె.. ఎక్కడ...

కన్నతండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడటం తండ్రి బాధ్యత. అలాంటి కుమార్తె పెడదారిన వెళుతుంటే ఏ తండ్రికైనా బాధ అనిపిస్తుంది.

Advertiesment
కళ్ళెదుటే ప్రియుడు తండ్రిని చంపేసినా ఏం కాలేదులే అన్న కుమార్తె.. ఎక్కడ...
, బుధవారం, 10 జనవరి 2018 (21:15 IST)
కన్నతండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడటం తండ్రి బాధ్యత. అలాంటి కుమార్తె పెడదారిన వెళుతుంటే ఏ తండ్రికైనా బాధ అనిపిస్తుంది. అయితే అలా కంటికి రెప్పలా కాపాడుకునే కుమార్తె వేరొకరికి ఇంటిలోనే రాసలీలలు ప్రారంభించింది. దీన్ని ప్రశ్నించిన తండ్రిని ప్రియుడు దారుణంగా కొట్టి హతమార్చాడు. అయితే ఇదేమీ పెద్ద విషయం కాదంటూ వెళ్ళిపోండంటూ పోలీసులనే బయటకు పంపించింది కుమార్తె. నోయిడాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
నోయిడాలోని అట్టాగ్రామంలో విశ్వనాథ్ సాహు అనే వ్యక్తి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు ఒక కుమార్తె ఉంది. గత నెలరోజులుగా కుమార్తె పూజ నడవడికపై తండ్రికి అనుమానం వచ్చింది. చాలాసార్లు హెచ్చరించాడు తండ్రి. అయినా పూజలో ఎలాంటి మార్పు రాలేదు. నిన్న రాత్రి పూజ గదిలో నుంచి చప్పుడు రావడంతో తండ్రి ఒక్కసారిగా గదిలోకి వెళ్ళిచూశాడు. గదిలో పూజతో పాటు ఆమె భాయ్ ఫ్రెండ్ రాసలీలల్లో మునిగి కనిపించాడు. దీంతో అతన్ని బయటకు వెళ్లిపొమ్మని చెప్పే ప్రయత్నం చేశాడు విశ్వనాథ్. తాను బయటకు వెళ్ళనంటూ విశ్వనాథ్ తో గొడవకు దిగాడు పూజ ప్రియుడు. ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగి చివరకు విశ్వనాథ్ కిందపడి చనిపోయాడు.
 
విషయం కాస్త పోలీసులకు తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూజ జరిగిన విషయాన్నంతా చెప్పి.. ఇది చాలా చిన్న విషయం.. దీన్ని పెద్దగా పట్టించుకోవద్దండి అంటూ పోలీసులకు చెప్పింది. కన్న తండ్రి చనిపోతే కనీసం బాధపడకుండా పోలీసులకు పూజ చెప్పిన సమాధానంతో తల్లి నివ్వెరపోయింది. పూజను అరెస్టు చేయమని తల్లే స్వయంగా పోలీసులకు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికెళ్లి తిరిగిరాదనీ.. ప్రియురాలిని కడతేర్చిన ప్రేమోన్మాది