Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హద్దుమీరితే పాక్ ఉగ్రశిబిరాలపై మళ్లీ సర్జికల్ దాడులు : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ నిత్యం రావణకాష్టం రగులుస్తున్న దాయాదిదేశం భరతంపట్టేందుకు సైన్యం ఏమాత్రం వెనుకాడే ప్రసక్తేలేదని భారత్ స్పష్టంచేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శ

Advertiesment
హద్దుమీరితే పాక్ ఉగ్రశిబిరాలపై మళ్లీ సర్జికల్ దాడులు : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
, బుధవారం, 4 జనవరి 2017 (05:44 IST)
సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ నిత్యం రావణకాష్టం రగులుస్తున్న దాయాదిదేశం భరతంపట్టేందుకు సైన్యం ఏమాత్రం వెనుకాడే ప్రసక్తేలేదని భారత్ స్పష్టంచేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలపై గత ఏడాది నవంబర్ 29న భారత సైన్యం సర్జికల్ దాడులతో విరుచుకుపడి 30 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెల్సిందే. ఈ దాడులపై ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. పైగా చర్చనీయాంశంగా కూడా మారాయి. దీంతో ఇండోపాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందిస్తూ.... నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రశిబిరాలపై దాడులు చేసే హక్కు భారత్‌కు ఉందని, అవసరమైతే మరిన్ని సర్జికల్ దాడులకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గత ఏడాది పాక్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం 'ఎంతో పకడ్బందీ'గా దాడులు చేసిందని ఆయన గుర్తు చేశారు. 
 
ఈ ఆపరేషన్‌ను ఆర్మీ స్టాఫ్ వైస్‌చీఫ్‌గా రావత్ స్వయంగా పర్యవేక్షించారు. పాక్ ఉగ్రశిబిరాలపై లక్షిత దాడులు చాలా పక్కాగా, మెరుపువేగంతో నిర్వహించినట్టు రావత్ తెలిపారు. ఒకవైపు దాడులు, మరోవైపు దళాల భద్రత రెండూ ఏకకాలంలో మానిటర్ చేసుకుంటూ దాడులు జరిపామన్నారు. సర్జికల్ దాడులు విజయవంతంగా నిర్వహించిన క్రెడిట్ తన ముందు సైన్యాధ్యక్షుడుగా ఉన్న దల్బీర్ సింగ్‌ సుహాగ్‌కే దక్కుతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పిజ్జా పేరు "24K".. పిజ్జాలో వేస్తున్నవి అవే... కావాలంటే 48 గంటల ముందుగా ఆర్డరివ్వాలి?