ఆ పిజ్జా పేరు "24K".. పిజ్జాలో వేస్తున్నవి అవే... కావాలంటే 48 గంటల ముందుగా ఆర్డరివ్వాలి?
న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్ అత్యంత ఖరీదైన పిజ్జాను తయారుచేసింది. ఈ పిజ్జాకు 24K అనే నామకరణం పెట్టారు. ఈ పిజ్జా కోసం ఆర్డరిచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఇంటికి వస్తుంది. కానీ, దీన్ని ఆరగిచాలంటే 48 గంటల మ
న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్ అత్యంత ఖరీదైన పిజ్జాను తయారుచేసింది. ఈ పిజ్జాకు 24K అనే నామకరణం పెట్టారు. ఈ పిజ్జా కోసం ఆర్డరిచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఇంటికి వస్తుంది. కానీ, దీన్ని ఆరగిచాలంటే 48 గంటల ముందు అంటే రెండు రోజులకు ముందుగా ఆర్డర్ చేయాల్సి ఉంది. ఇంతకీ ఆ పిజ్జా తయారీలో ఏం వాడుతారు.. దాని ధర ఎంతో తెలుసుకుందాం.!
న్యూయార్క్‌లోని ఇండస్ట్రీ కిచెన్ రెస్టారెంట్ ఉంది. ఇది 24K గోల్డ్ పేరుతో ఓ పిజ్జాను తయారు చేసింది. 24 క్యారట్ల బంగారు రేకులు, ఊరబెట్టిన ఎండు చేప ముక్కలు (ఇది అరుదైన జాతి), నోరూరించే ఓ రకం దుంపతో ఈ పిజ్జాను తయారు చేసింది. ఇది చూడగానే లొట్టలు వేయిస్తుంది. పైగా, దీని ధర ఎంతో తెలుసా? అక్షరాలా 2 వేల డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.1.30 లక్షలు. ఇంకెందుకు ఆలస్యం చాలా ఖరీదైన పిజ్జా చేయాలంటే ఇపుడే ఆర్డర్ ఇవ్వండి.