Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాన్నా నువ్వు చేస్తున్నది తప్పురా.. ములాయం విలాపం..!

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సొంత పార్టీపైనే బిగ్ బాంబ్ వేశారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్నోసార్లు చేదు అనుభవాలు చవి చూసిన అనుభవం కలిగిన పెద్దాయన ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్‌ను ఎప్పుడూ ఆమడ దూరం పెడుతూ వచ్చారు. తన కుమారుడు అఖిలేష్ య

నాన్నా నువ్వు చేస్తున్నది తప్పురా.. ములాయం విలాపం..!
హైదరాబాద్ , సోమవారం, 30 జనవరి 2017 (04:09 IST)
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సొంత పార్టీపైనే బిగ్ బాంబ్ వేశారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్నోసార్లు చేదు అనుభవాలు చవి చూసిన అనుభవం కలిగిన పెద్దాయన ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్‌ను ఎప్పుడూ ఆమడ దూరం పెడుతూ వచ్చారు. తన కుమారుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న పొత్తు తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతూ ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ కూటమి తరపున వారి కోసం ప్రచారం చేయబోనని కరాఖండిగా చెప్పారు. తొలి నుంచీ తాను కాంగ్రెస్ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. 
 
ఉత్తరప్రదేశ్‌లో సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా కాంగ్ర్రెస్ పార్టీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నారని ములాయం విమర్శించారు. తనను నమ్ముకున్న నేతలకు టికెట్లు రాలేదని, వారు ఎన్నికల కోసం ఐదేళ్ల పాటు వేచి ఉండాల్సిందేనా అని ప్రశ్నించారు. ఎన్నికలు అతి సమీపానికి వచ్చిన తరుణంలో ములాయం చేసిన ఈ ప్రకటన పార్టీకి, పొత్తుకు చేటు తేవడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
 
ఇటీవలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ముఖ్యమంత్రి అఖిలేష్ చేసిన సంచలన ప్రకటన తడి ఆరకముందే తనయుడి పొత్తు ఎంపికపైనే ధ్వజమెత్తిన ములాయం ససేమిరా పొత్తుకు అనుకూలంగా ప్రచారం చేయనని భీష్మించుకు కూర్చోవడం పార్టీకీ నష్టం కలిగించటం కంటే బీజీపేకి లబ్ధి కలిగించే ప్రమాదమే ఎక్కువని పరిశీలకుల అంచనా. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. ప్రియాంకను ఓ రేంజిలో ఉబ్బించేస్తున్న రాహుల్