Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. ప్రియాంకను ఓ రేంజిలో ఉబ్బించేస్తున్న రాహుల్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎవరినైనా ప్రశంసించడం చాలా అరుదు. పైగా దేశంలో జరుగుతున్న అన్ని పరిణామాలపైనా ప్రతికూల దృక్పథంతో విమర్ళిస్తుంటారన్ని అపప్రథ కూడా అధికార బీజేపీ నుంచి ఆయన ఎదుర్కున్నారు కూడా. అలాంటిది సొంత చెల్లెలు ప్రియాంక గాధీం

Advertiesment
Priyanka
హైదరాబాద్ , సోమవారం, 30 జనవరి 2017 (02:53 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎవరినైనా ప్రశంసించడం చాలా అరుదు. పైగా దేశంలో జరుగుతున్న అన్ని పరిణామాలపైనా ప్రతికూల దృక్పథంతో విమర్ళిస్తుంటారన్ని అపప్రథ కూడా అధికార బీజేపీ నుంచి ఆయన ఎదుర్కున్నారు కూడా. అలాంటిది సొంత చెల్లెలు ప్రియాంక గాధీంపై ఆయన ప్రశంసలు గుప్పించిన తీరు తర్చుకుంటే నీపాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా నీ కన్న రుణమూ తీర్చుకుంటనే చెల్లెమ్మా అనే గద్దర్ పాట గుర్తుకొస్తోంది. విషయమేమిటంటే సమాజ్‌వాదీ పార్టీతో  కాంగ్రెస్‌కు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పొత్తు కుదిర్చిన ఘనత పూర్తిగా ప్రియాంకా గాంధీదేనట. అదీ రాహుల్ ప్రశంసకు కారణం.
 
ప్రియాంక కాంగ్రెస్ పార్టీకి దక్కిన గొప్ప సంపద అని  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొనియాడారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు విషయంలో ప్రియాంక గాంధీ చూపించిన చొరవకు ఆమె సోదరుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రశంసల జల్లు కురిపించారు. ఎస్పీతో పొత్తు విషయంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించిందన్నారు. అఖిలేష్‌ యాదవ్‌తో కలిసి లక్నోలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న రాహుల్, పొత్తు విషయంలో ప్రియాంక తనకు గొప్ప సాయం చేసిందన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది లేనిదీ ఆమె ఇష్టానికే వదిలిపెట్టినట్టు తెలిపారు. 
 
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమాచారం ప్రకారం, కాంగ్రెస్, సమాజ్‌వాదీ కూటమి తరఫున అమేథీ, రాయబరేలీలో ప్రియాంక ప్రచారం చేయనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల వెలుపల మరో అరడజను నియోజకవర్గాల్లోనూ ఆమె ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులో భాగంగా 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సమాజ్‌వాదీ పార్టీ 298 సీట్లలోనూ, కాంగ్రెస్ 105 సీట్లలోనూ పోటీ చేస్తోంది. ఏడు విడతల యూపీ పోలింగ్ ఫిబ్రవరి 11న ప్రారంభమై మార్చి 8తో ముగుస్తుంది.
 
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీకి పూర్తి మెజారిటీ రాదని, హంగ్ తప్పదని తాజా సర్వేలు కోడై కూస్తున్న నేపధ్యంలో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు ఆ కూటమికి ఏమేరకు ప్రయోజనం కల్గించనుందన్న విషయం అంతు దొరకటం లేదు. రాహుల్ ప్రచారం ప్రతి చోటా బెడిసి కొడుతున్న నేపథ్యంలో ప్రియాంక ఆగమనం ఇకనైనా కాంగ్రెస్‌కు మేలు చేకూర్చుతుందేమో వేచి చూడాల్సిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్టుతో మార్కులు కొట్టేసి యూపీని పట్టేస్తారేమో... మోదీజీ ఇప్పుడే వద్దు... అఖిలేష్