Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిన్న రాజస్థాన్... నేడు మధ్యప్రదేశ్.. ఉప ఎన్నికల్లో "హస్త"వాసి

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాలి వీజడం మొదలైంది. ఈనెలారంభంలో రాజస్థాన్ రాష్ట్రంలో వెల్లడైన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. ఇపుడు మధ్యప్రదేశ్

నిన్న రాజస్థాన్... నేడు మధ్యప్రదేశ్.. ఉప ఎన్నికల్లో
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (19:57 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాలి వీజడం మొదలైంది. ఈనెలారంభంలో రాజస్థాన్ రాష్ట్రంలో వెల్లడైన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. ఇపుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఉప సమరంలో హస్తం గాలి వీచింది. అలాగే, లుథియానా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ స్వీప్ చేసింది. 
 
మధ్యప్రదేశ్‌లోని ముంగౌలి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి భాయ్ సాహెబ్‌పై 2,124 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా, తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. చివరి రౌండ్ పూర్తయ్యే సరికి 2,124 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ నిలవడంతో బ్రిజేంద్ర సింగ్ యాదవ్ గెలిచినట్టు ప్రకటించారు. 
 
కాగా, ఉపఎన్నిక జరిగిన కొలారస్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ యాదవ్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ రెండు నియోజకవర్గాలకు ఈనెల 24న పోలింగ్ జరిగింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ముంగౌలి, కొలారస్ ఉప ఎన్నికలను అటు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం సాగించాయి. అలాగే, లుథియానా మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ తేరుకోలేని షాకిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్ సమావేశాలకు వైసీపి సభ్యులను ఆహ్వానిస్తున్నా... స్పీకర్ కోడెల, వస్తారా?