Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వధువు స్థానంలో తల్లి.. బిత్తరపోయిన వరుడు...

Advertiesment
meerut nikah twist

ఠాగూర్

, ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (08:53 IST)
పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వధువు కాకుండా ఆమె తల్లి కూర్చొంది. దీన్ని చూసిన వరుడు బిత్తరపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వెలుగులోకి వచ్చింది. పెళ్లి పీటలపై వధువు కాకుండా ఆమె తల్లి కూర్చోవడంతో వరుడు ఆందోళనకు దిగి, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
మీరట్ బ్రహ్మపురికి చెందిన మొహమ్ద్ అజీం (22) అనే యువకుడుకి శామలీ జిల్లా వాసి మంతశా (21)తో పెళ్ళి కుదిరింది. నిఖాలో వధువు పేరు  వంతాశా కాకండా తాహిరా అని పలకడంతో వరుడుకి అనుమానం వచ్చింది. దీంతో ముసుకు తొలగించి చూడగా మంతాశాకు బదులుగా ఆమె తల్లి తారాహి (45) వధువు వేషంలో కూర్చొనివుంది. ఈ పెళ్లికి వరుడు తరపున పెద్దలుగా వ్యవహరంచిన అతడి అన్న వదినలు వధువు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై ఈ పనికి పాల్పడినట్టు తెలిసింది. 
 
పైగా, అల్లరి చేస్తే అఘాయిత్యం చేసినట్టు కేసు పెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆందోళనకు దిగిన వరుడు అజీం.. తాను పూర్తిగా మోసపోయానని బోరున విలపిస్తూ, పెళ్లికి రూ.5 లక్షలు ఖర్చు చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదలో పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Japan Bullet Train in India: 2026లో భారత దేశానికి చేరుకోనున్న బుల్లెట్ రైళ్లు (video)