Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తగాదాలకు కేరాఫ్‌గా ఢిల్లీ మెట్రో : ప్రయాణికుడిని చెప్పుతో కొట్టి మరో ప్యాసింజర్ (Video)

delhi metro slipper attack

వరుణ్

, గురువారం, 1 ఆగస్టు 2024 (16:44 IST)
ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు ప్రయాణికులు గొడవపడ్డారు. వీరిద్దరి కోపం తారా స్థాయికి చేరింది. దీంతో ఓ ప్రయాణికుడు సహచర ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేశాడు. ప్రయాణికుడిని చెప్పుతో కొడుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వాళ్లను మెట్రోల్లోకి అనుమతించొద్దంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇటీవలి కాలంలో ప్రయాణికుల తగాదాలకు కేరాఫ్‌గా ఢిల్లీ మెట్రో మారింది. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు మరో వ్యక్తిని చెప్పుతో కొట్టాడు. వారి వివాదానికి గల కారణం తెలియరానప్పటికీ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ సృష్టిస్తోంది.
 
తొలుత ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే వివాదం ముదిరి అనూహ్య మలుపు తీసుకుంది. ఓ ప్రయాణికుడు అవతలి వ్యక్తిని ఏకంగా చెప్పుతో కొట్టాడు. దీంతో, క్షణకాలం షాకైపోయిన అతడు తనను చెప్పుతో కొట్టిన వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించాడు. ఆ తర్వాత అతడి నుంచి దూరంగా వెళుతుండగా ప్రయాణికుడు మళ్లీ చెప్పు పట్టుకుని అతడిని వెంబడించాడు. ఈలోపు, మరో వ్యక్తి జోక్యం చేసుకుని అతడిని అడ్డుకున్నాడు.
 
వీడియోపై జనాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెప్పుతో కొట్టిన వ్యక్తిని అరెస్టు చేసి తీరాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంస్కార రహితుల్ని మెట్రోల్లోకి అనుమతించకూడదని కొందరు అభిప్రాయపడ్డారు. మెట్రోలో అంతమంది ఉన్నా కేవలం ఒకే వ్యక్తి గొడవ ముదరకుండా అడ్డుకోవడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. అక్కడున్న మిగతా వారికి సామాజిక స్పృహలేదంటూ దుమ్మెత్తిపోశారు. చెప్పుతో కొట్టిన వ్యక్తి మద్యం మత్తులో ఉండిఉండొచ్చని కొందరు అన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్సీ వర్గీకరణకు భారాస చిత్తశుద్ధితో పని చేస్తుంది : మాజీ మంత్రి కేటీఆర్