Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారును ఆవుపేడతో అలికారు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..?

కారును ఆవుపేడతో అలికారు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..?
, మంగళవారం, 21 మే 2019 (19:17 IST)
సాధారణంగా చాలామంది కోట్ల రూపాయలు వెచ్చించి కారులు కొనుక్కొని, వాటిని చాలా అపురూపంగా చూసుకుంటుంటారు. అయితే ఓ వ్యక్తి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేయక మానదు. సదరు వ్యక్తి కోటి రూపాయలు పెట్టి ముచ్చటగా కొత్త కారు కొనుక్కున్నాడు.


స్టార్ట్ చేసి తొక్కితే సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. అయితే 45 డిగ్రీల ఎండలో ఏసీ పని చేయకపోవడంతో పాటు కారు ఓనర్ ఫ్యాన్‌ను ఫుల్ స్పీడ్‌లో పెట్టినప్పటికీ ఉక్కపోత తప్పడం లేదట. అందుకే కారు యజమాని ఓ సరికొత్త ఐడియా ఆలోచించాడు.
 
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన సెజల్ షా వ్యాపారి. కోటి రూపాయలతో కారు కొనుగోలు చేశారు. ఎండ వేడిమి నుంచి రక్షణ కోసం, చల్లదనం కోసం కారు బయటి భాగం మొత్తాన్ని ఆవు పేడతో అలికేశాడు.

ఏ మాత్రం గ్యాప్ లేకుండా మందంగా పేడ రాశాడు. ఆ తర్వాత అంతా కూల్‌గా ఉందంట, ఏసీ వేస్తే చలి పుడుతుందట. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందాలి అంటే ఇదో చక్కటి ఉపాయం అంటున్నారు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి.
 
ఆవు పేడతో కారుకు చల్లదనం వస్తుందో లేదో ఏమోగానీ..గతంలో మాత్రం ఇంటిని ఆవుపేడతో అలికేవారు. దీనివల్ల చల్లదనంతో పాటు క్రిమికీటకాలు రాకుండా ఉండేవి. అయితే 50 ఏళ్ల క్రితం ఇంట్లో పేడ అలికేవారు.. ఇప్పుడు కోట్ల రూపాయలు కొనుక్కున్న కారుకు ఆవుపేడ అలుకుతున్నారంటే ఆశ్చర్యపడవలసిన విషయమే సుమా!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పతనమవుతున్న బంగారం ధరలు...