Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్కారు కొలువు వద్దని భార్య చేయి నరికిన భర్త.. ఎక్కడ?

Advertiesment
woman hand chops Off
, బుధవారం, 8 జూన్ 2022 (08:37 IST)
ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎగిరి గంతేస్తారు. కనీసం తనకు రాకపోయినా తన కుటుంబ సభ్యుల్లో ఒకరి వచ్చినా సంబరపడిపోతారు. కానీ, ఇక్కడో భర్త కట్టుకున్న భార్యకు సర్కారు కొలువు రావడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ప్రభుత్వం ఉద్యోగం రావడం వల్ల తనను వదిలి వెళుతుందని భావించి ఆమె చేయిని నరికివేశాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగాల్ రాష్ట్రంలోని తూర్పు బర్ధమాన్ జిల్లా కోజల్సా గ్రామానికి చెందిన షేర్ మహమ్మద్  - రేణు ఖాతున్ అనే దంపతులు ఉన్నారు. దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో నర్సింగ్‌లో శిక్షణ పొందుతున్న రేణుకు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. 
 
దీంతో ఆమె ఎగిరి గంతేసింది. కానీ, ఆమె బర్త షేక్ మహ్మద్ మాత్రం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదా ఉమె ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టంలేకపోవడంతో ఉద్యోగానికి వెళ్లొద్దని, ఇంటి వద్దనే ఉండాలంటూ ఒత్తిడి చేయసాగాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 
 
రేణూ మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న పట్టుదలతో ఉద్యోగానికి వెళ్లేందుకే మొగ్గు చూపింది. దీంతో ఆగ్రహించిన షేక్.. తన మాట వినని భార్య చేయి తెగనరికి అక్కడి నుంచి పారిపోయాడు. కత్తితో దాడి చేయడంతో ఆమె చేయిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వైద్యులు చేతిని తొలగించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న షేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం తగ్గింది.. అందుకే ఉత్తీర్ణతా శాతం తగ్గింది!!