Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థియేటర్లో సినిమా చూస్తున్న వాళ్లంతా పరుగులు తీశారు.. ఎందుకో తెలుసా?

థియేటర్లో సినిమా చూస్తున్న వాళ్లంతా పరుగులు తీశారు. ఎందుకో తెలుసా.. అయితే చదవండి మరి. వీకెండ్ కదా.. సరదాగా సెకండ్ షో చూద్దామని వెళ్లిన ప్రేక్షకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. థియేటర్లో మంటలు చెలరేగడంతో

Advertiesment
థియేటర్లో సినిమా చూస్తున్న వాళ్లంతా పరుగులు తీశారు.. ఎందుకో తెలుసా?
, సోమవారం, 6 ఆగస్టు 2018 (15:40 IST)
థియేటర్లో సినిమా చూస్తున్న వాళ్లంతా పరుగులు తీశారు. ఎందుకో తెలుసా.. అయితే చదవండి మరి. వీకెండ్ కదా.. సరదాగా సెకండ్ షో చూద్దామని వెళ్లిన ప్రేక్షకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. థియేటర్లో మంటలు చెలరేగడంతో.. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు ప్రేక్షకులు  సురక్షితంగా బయట పడటంతో కథ సుఖాంతమైంది. 
 
వివరాల్లోకి వెళితే.. నటుడు, ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌ అరిజిత్‌ దత్తాకు దక్షిణ కోల్‌కతాలో ప్రియా థియేటర్‌ ఉంది. అయితే ఆదివారం రాత్రి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు సెకండ్‌ షో మూవీ చూస్తున్నారు. ఇంతలో థియేటర్‌లో పొగలు రావడాన్ని గమనించిన ప్రేక్షకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కానీ ప్రాజెక్టర్‌ రూమ్‌ టెక్నీషియన్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. 
 
మరోవైపు మెట్లమార్గం ద్వారా ప్రేక్షకులను సురక్షితంగా బయటకు రప్పిస్తూనే.. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. దీంతో థియేటర్‌ యాజమాన్యంతో పాటు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమెకు 35.. ఆయనకు 60.. గట్టిగా పట్టుకుని కిందపడేసి రేప్ చేయబోయాడు... చివరకు...