Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2018 : రస్సెల్ వీరవిహారం... రాజస్థాన్ చిత్తు.. కోల్‌కతా విన్

ఐపీఎల్ సీజన్-11లో భాగంగా బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 25 పరుగులు తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. ఆండ్రీ రస్సెల్స్ వీరబాదు

ఐపీఎల్ 2018 : రస్సెల్ వీరవిహారం... రాజస్థాన్ చిత్తు.. కోల్‌కతా విన్
, గురువారం, 24 మే 2018 (10:41 IST)
ఐపీఎల్ సీజన్-11లో భాగంగా బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 25 పరుగులు తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. ఆండ్రీ రస్సెల్స్ వీరబాదుడుతో ఈ జట్టు కోలుకుని విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో కోల్‌కతా హైదరాబాద్‌‌తో శుక్రవారం (మే-25) క్వాలిఫయర్-2 ఆడుతుంది.
 
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టులో నరైన్‌ 4, లిన్‌ 18, ఊతప్ప 3, రాణా 3, దినేశ్‌ కార్తీక్‌ 52, గిల్‌ 28, రస్సెల్‌ (నాటౌట్‌) 49, సెరల్స్‌ 2, చావ్లా (నాటౌట్‌) 0 చొప్పున పరుగులు చేశారు. అలాగే, పది రన్స్ ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్ఆర్ బౌలర్లలో గౌతమ్‌ 2, ఆర్చర్‌ 2, శ్రేయాస్‌ గోపాల్‌ 1, లాగ్లిన్‌ 2 చొప్పున వికెట్లు తీశారు. 
 
ఆ తర్వాత రాజస్థాన్ జట్టులో రహానే 46, రాహుల్‌ త్రిపాఠి 20, శాంసన్‌ 50, క్లాసెన్‌ (నాటౌట్‌) 18, బిన్నీ 0, కృష్ణప్ప గౌతమ్‌ (నాటౌట్‌) 9 చొప్పున పరుగులు చేయగా, 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 1, పియూష్‌ చావ్లా 2, నరైన్‌, కుల్దీప్‌ యాదవ్‌ 1 చొప్పున వికెట్లు తీశారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రస్సెల్‌కు లభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెటర్ భార్య గర్భస్రావానికి బాల్ ట్యాంపరింగ్ వివాదం...