Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళను ముంచెత్తిన వరదలు.. ఒక్క రోజే 29 మంది మృతి

కేరళను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో కర్ణాటకలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో కోస్టల్ కర్ణాటక, పాత మైసూర్ ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పర్వతప్రాంతాల్లో కొండచరియలు విర

కేరళను ముంచెత్తిన వరదలు.. ఒక్క రోజే 29 మంది మృతి
, గురువారం, 16 ఆగస్టు 2018 (12:27 IST)
కేరళను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో కర్ణాటకలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో కోస్టల్ కర్ణాటక, పాత మైసూర్ ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పర్వతప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా ఇద్దరు చనిపోగా, మరొకరు గల్లంతయ్యారు.


దక్షిణ కర్నాటక, హసన్, చిక్కమగళూరు, కొడగు, శివమొగ్గ జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
 
మరోవైపు కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యావత్ రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. వరదలు, కొండచరియలు విరిగినపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 72కి చేరింది. ఆగస్టు 15వ తేదీన ఒక్క రోజే 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 14 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 
 
పెరియార్ నది మహోగ్రరూపం దాల్చడంతో నది పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వేలాది మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. కేరళ చరిత్రలో తొలిసారిగా 27 డ్యాంలను తెరిచారు. వర్షాలధాటికి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మూతపడింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 
 
కేరళలో రవణా వ్యవస్థ స్తంభించిపోవడంతో పర్యాటకులు, విదేశీయలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రభుత్వం అధికారికంగా ఓనం పండగ నిర్వహించకూడదని నిర్ణయించింది. వేడులకు ఖర్చుచేసే డబ్బును వరద బాధితుల కోసం వెచ్చిస్తామని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ముగిసిన మహా సంప్రోక్షణ.. భక్తులకు శ్రీవారి దర్శనం