వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమం.. ఎయిమ్స్ హెల్త్ బులిటెన్
బీజేపీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. జూన్ 11 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కురువృద్ధుడి ఆరోగ్యం క్షీణించి
బీజేపీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. జూన్ 11 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కురువృద్ధుడి ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు ప్రకటన విడుదల చేయడంతో కాషాయదళంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అటల్ ఆరోగ్యం విషమించిందన్న వార్త తెలియగానే ప్రముఖులు ఎయిమ్స్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు.
ప్రధాని మోదీ బుధవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి సుమారు గంటపాటు అక్కడే గడిపారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా గురువారం ఉదయం ఎయిమ్స్‌కి వెళ్లారు. తాజాగా వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు ఎయిమ్స్ వైద్యులు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.
కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వాజ్ పేయి చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఇటీవల చేరారు. ఆయన ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్‌కు చేరుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.