Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభిమానించే వ్యక్తి మృతి చెందడంతో సూసైడ్ చేసుకున్న వివాహిత

Advertiesment
అభిమానించే వ్యక్తి మృతి చెందడంతో సూసైడ్ చేసుకున్న వివాహిత
, బుధవారం, 15 మే 2019 (09:32 IST)
మహిళలకు సెంటిమెంట్ ఎక్కువ. చిన్నపాటి విషయాలకే వారు సెంటిమెంట్‌కు గురవుతుంటారు. తాజాగా తనను అభిమానించే వ్యక్తి ఒకరు చనిపోవడాన్ని తట్టుకోలేని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటక రాష్ట్రంలోని మజరాహోసహళ్లి గ్రామానికి చెందిన పుట్టరాజు అనే వ్యక్తి భార్య పుష్పలత. ఈమెను అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అమితంగా అభిమానించేవాడు. అయితే, ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పుష్పలత ఆహారపానీయాలు ముట్టుకోకుండా దిగాలుగా ఇంట్లోనే కూర్చొండిపోయింది. 
 
ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పుష్పలత ఉరివేసుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండగా, భర్త పుట్టరాజు స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కన్నడ భాషా సంఘాల ఆధ్వర్యాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే పుష్పలత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోదుస్తులు విప్పీ దాన్ని చూపించాడు... కానిస్టేబుల్ కుమార్తె పట్ల ఖాకీ అసభ్య ప్రవర్తన