Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం: భారీ బందోబస్తు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రంలో రెండు స్థానాలు మినహా మొత్తం 222 స్థానాలకు గాను పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం: భారీ బందోబస్తు
, శనివారం, 12 మే 2018 (08:31 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కర్ణాటక రాష్ట్రంలో రెండు స్థానాలు మినహా మొత్తం 222 స్థానాలకు గాను పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. మొత్తం పోలింగ్ బూత్‌లలో 534 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 12 వేలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1.5లక్షల మంది పోలీసులు, 50 వేల మంది కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. 
 
ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్న తరుణంలో పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించారు. ఇంకా కర్ణాటకలో 222 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా 58,008 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,984 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పోలింగ్‌ను పురస్కరించుకుని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 17వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
 
మరోవైపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్‌ (ఆర్‌ఆర్‌ నగర్‌) అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 28కి వాయిదా పడింది. ఆ ఎన్నిక ఫలితం ఈ నెల 31న వెలువడుతుంది. ఇటీవల ఆ నియోజకవర్గంలోని ఓ ఫ్లాట్‌లో 9746 ఓటరు కార్డులతో పాటు పోలింగ్‌లో ఉపయోగించే కొన్ని వస్తువులను అధికారులు సీజ్‌ చేశారు. ఈ క్రమంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే,
 
కాగా, బీజేపీ అభ్యర్థి మృతితో ఇప్పటికే జయనగర్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ వాయిదా పడింది. దీంతో కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 222 స్థానాలకి మాత్రమే రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 15న ప్రకటించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాకింగ్... కరెంట్ బిల్లు చూసి ఆత్మహత్య చేసుకున్నాడు