Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకుపచ్చ చీర, గాజులు, గడియారాలతో భూమాత ఒడిలోకి జయలలిత..

ఎప్పుడో ముచ్చటపడి చేయించుకుని చేతికి తొడుక్కున్న బంగారు గాజులు సైతం తమిళనాడు సీఎం జయలలితతో పాటు మట్టిలో కలిసిపోయాయి. ఆ బంగారు గాజులకు అమ్మ ఎప్పుడూ దూరం కాలేదు. అవంటే జయలలితకు ఎంతో ఇష్టం. వీటితో పాటు ఆ

ఆకుపచ్చ చీర, గాజులు, గడియారాలతో భూమాత ఒడిలోకి జయలలిత..
, బుధవారం, 7 డిశెంబరు 2016 (11:19 IST)
ఎప్పుడో ముచ్చటపడి చేయించుకుని చేతికి తొడుక్కున్న బంగారు గాజులు సైతం తమిళనాడు సీఎం జయలలితతో పాటు మట్టిలో కలిసిపోయాయి. ఆ బంగారు గాజులకు అమ్మ ఎప్పుడూ దూరం కాలేదు. అవంటే జయలలితకు ఎంతో ఇష్టం. వీటితో పాటు ఆమెను అనునిత్యం అంటిపెట్టుకుని ఉండేది. ఈ గాజులతో పాటు అమ్మ చేతికి వుండిన బంగారు గడియారం కూడా ఆమెతో సమాధి అయ్యింది. 
 
ఈ విషయం జయ నెచ్చెలి శశికళకు తెలిసే.. పార్థివదేహం నుంచి గాజులను, గడియారాన్నీ తీయకుండానే ఖననం చేసినట్టు తెలుస్తోంది. తనకెంతో ఇష్టమైన, అత్యధికంగా కనిపించే ఆకుపచ్చ చీరలో, తనకు నచ్చిన గాజులు, గడియారాలతో పాటు ఆమె భూమాత ఒడిలోకి చేరిపోయారు. అలాగే జయలలిత గులాబీ పువ్వులంటే ఎంతో ఇష్టమట. 
 
ముఖ్యంగా గులాబీ పూల బొకేలంటే ఎంతో ఇష్టంగా తీసుకునేవారట. ఆ పుష్పగుఛ్చాలను చూసి చిన్నపిల్లలా ఆమె సంతోషపడిపోయేవారట. అంతేకాదు, ఆకుపచ్చ రంగు, 2,5,6,9 సంఖ్యలు తనకు బాగా కలిసొచ్చేవని జయలలిత నమ్మేవారట. అందుకే, ఎక్కువగా ఆకుపచ్చ రంగు చీరలోనే ఆమె ఎక్కువగా కనిపించేవారని చెప్తుంటారు. 
 
కాగా తమిళనాడు ముఖ్యమంత్రి పురచ్చితలైవి జె.జయలలిత (68) సోమవారం రాత్రి 11:30 గంటలకు ఆమె మృతిచెందిన సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే అపోలో వైద్యులు ఆమె ఆరోగ్యం పట్ల బులిటెన్లు విడుదల చేశాయే తప్ప.. ఆ ఫోటోలను విడుదల చేయలేదు. చివరికి మృతదేహంగానే జయలలితను బయటికి పంపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో వాయుగుండం.. తుఫానుగా మారే అవకాశం.. భారీ వర్షాలు..?