Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగాళాఖాతంలో వాయుగుండం.. తుఫానుగా మారే అవకాశం.. భారీ వర్షాలు..?

దక్షిణ అండమాన్‌లో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీంతో ఈ వాయుగుండం మరో 24 గంటల్లో బలపడి తుఫానుగా మార

Advertiesment
Depression over Bay of Bengal likely to turn into cyclonic storm: MET department
, బుధవారం, 7 డిశెంబరు 2016 (11:08 IST)
దక్షిణ అండమాన్‌లో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీంతో ఈ వాయుగుండం మరో 24 గంటల్లో బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుఫానుగా మారితే ఏపీలో తీరం దాటే అవకాశముంది. ఇప్పటికే అండమాన్‌లో వర్షాలు కురుస్తున్నాయి.
 
బంగాళాఖాతంలో వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 1320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. 48 గంటల్లో తీవ్ర వాయుగుండం తుపానుగా మారే సూచనలున్నాయని అంచనా వేశారు. వాయుగుండం మరో 72 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముంది. ప్రస్తుతం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 1180 కి.మీ, పోర్ట్‌బ్లెయర్‌కి దక్షిణ నైరుతిగా 310 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో చెన్నైకి వర్ష ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరణశయ్యపై సైతం జయలలిత ముఖారవిందం చెక్కుచెదరలేదు.. ఎందుకో తెలుసా?