Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరణశయ్యపై సైతం జయలలిత ముఖారవిందం చెక్కుచెదరలేదు.. ఎందుకో తెలుసా?

శాశ్వతనిద్రలోకి జారుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖారవిందం మరణశయ్యపై సైతం చెక్కుచెదరలేదు. ఎందుకో తెలుసా...? అయితే ఈ కథనం చదవండి... వెండితెర ఇలవేల్పు.. నాటి యువతరం కలలరాణి జయలలిత.

Advertiesment
మరణశయ్యపై సైతం జయలలిత ముఖారవిందం చెక్కుచెదరలేదు.. ఎందుకో తెలుసా?
, బుధవారం, 7 డిశెంబరు 2016 (10:56 IST)
శాశ్వతనిద్రలోకి జారుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖారవిందం మరణశయ్యపై సైతం చెక్కుచెదరలేదు. ఎందుకో తెలుసా...? అయితే ఈ కథనం చదవండి... వెండితెర ఇలవేల్పు.. నాటి యువతరం కలలరాణి జయలలిత. ఆ తర్వాత తిరుగులేని రాజకీయధీశాలిగా నిలబెట్టింది కూడా అదే చరిష్మానే. ఆ ఛరిష్మాతోనే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 
 
మరణించిన తర్వాత కూడా ఆమె ముఖారవిందంలో ఏమాత్రం మార్పులేదు. మరణశయ్యపై సైతం ఆ ముఖారవిందం చెక్కుచెదరలేదు. దాని వెనుక దాగిన రహస్యం ఏమిటంటే.. ఎంబాల్మింగ్ ప్రక్రియ. తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు చికిత్స పొందుతూ మృతి చెందినపుడు వారి బంధువులు కోరితే ఎంబాల్మింగ్ అనే రసాయన ప్రక్రియ ద్వారా దేహాన్ని పాడవకుండా చేస్తారు. 
 
మృతి చెందినా.. మునుపటి కళ మారకుండా ఉండేందుకు ప్రయోగించే ఈ విధానాన్ని గతంలో పుట్టపర్తి సత్యసాయి బాబాకు, నేడు జయలలితకు కూడా ప్రయోగించినట్లు వైద్యవర్గాలు తెలిపారు. అయితే, ఇది కొంచెం ఖరీదైన వ్యవహారం కావడంతో ప్రతి ఒక్కరూ ఇందుకు మొగ్గుచూపరని తెలిపారు. ఆకర్షణీయమైన ముఖం, మాటలతో తమిళ ప్రజలను ఆకట్టుకున్న జయలలిత.. ప్రజల మదిలో అదేరీతిలో నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఎంబాల్మింగ్ చేసినట్లు వైద్యులు చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

500 కేజీల ఈజిప్టు మహిళకు ముంబైలో చికిత్స.. సుష్మా స్వరాజ్ ఉదారత వల్లే?