Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూగర్భ జలాలు: వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా నిర్లక్ష్యం చేసిన ప్రపంచ రక్షణ

భూగర్భ జలాలు: వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా నిర్లక్ష్యం చేసిన ప్రపంచ రక్షణ
, మంగళవారం, 22 మార్చి 2022 (00:11 IST)
భూగర్భజలం - దాదాపు అన్నిచోట్లా భూగర్భంలోనే ఉంటుంది. ఈ భూగర్భ జలాలు వందల వేల జనాభా యొక్క ప్రాణాలను కాపాడే సామర్ధ్యం కలిగి మరియు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రపంచ బీమా పాలసీగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచ నీటి దినోత్సవం-2022 సందర్భంగా, "గ్రౌండ్ వాటర్: వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా నిర్లక్ష్యం చేసిన ప్రపంచ రక్షణ " అనే పేరుతో WaterAid ఒక నివేదికను విడుదల చేస్తోంది, ఇది ప్రపంచంలోని వివి ధ ప్రాంతాలలోని భూగర్భ జల వనరుల పరిస్థితిపై తీవ్ర దృష్టి సారిస్తుంది.

 
బ్రిటీష్ జియోలాజికల్ సర్వే (BGS) మరియు వాటర్ ఎయిడ్ యొక్క కొత్త విశ్లేషణ ప్రకారం ఆఫ్రికాలోని అనేక దేశాల్లో - మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి మరియు చాలా కాలం పాటు ఉపయోగించుకోవడానికి తగినంత భూగర్భ జలాలు కలిగి ఉన్నాయని వెల్లడించింది. కానీ ముఖ్యంగా ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, భూగర్భజలాల నిర్వహణ లేమి మరియు నీటి కాలుష్యం భూగర్భజల వనరుల కొరతకు దారి తీస్తోంది. ఈ ప్రక్రియ రాబోయే సంవత్సరాల్లో మిలియన్ల జనాభా పై ప్రభావితం చూపిస్తుంది ప్రభావితం చేస్తుంది.
 
ఉదాహరణకు సబ్-సహారా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో భూగర్భజలాలు ఎక్కువగా ఉపయోగించబడలేదు, అయితే దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాల్లో మితిమీరిన వినియోగం ఎక్కువగా ఉంది. తగినంత నైపుణ్యం మరియు పెట్టుబడి లేకపోవటంతో పాటుగా, పేలవమైన నియంత్రణ- నిర్వహణ లోపం, నీటి వనరుల కాలుష్యం మరియు నీటి కాలుష్యం - ఇవి వినాశకరమైన పరిణామాలకు దారితీస్తాయి.
 
WaterAid యొక్క పరిశోధనా బృందం యొక్క పరిశోధనలు ప్రకారం ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లో చాలా వరకు భూగర్భజలాల వెలికితీత, సాధారణంగా వర్షపాతం నుండి జరిగే భూగర్భజలాల పునరుద్ధరణ కంటే ఎక్కువగా ఉందని వెల్లడిస్తున్నాయి. ఈ కారణం గా  కరువు కాలంలో నీటి సరఫరా నిలకడగా ఉండకపోవచ్చు మరియు ప్రజలకు చాలా అవసరమైన సమయంలో నీటి  వనరులు అయిపోవచ్చు. కొన్ని దక్షిణాసియా దేశాలలో  భూగర్భ జలాల్లో సేకరించిన 90% వరకు నీటిని  వ్యవసాయం కొరకు ఉపయోగిస్తున్నారు.
 
ఫలితంగా  గ్రామాల్లోని బావులు ఎండిపోవచ్చు మరియు కమ్యూనిటీలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు మరియు పాఠశాలలు వారి రోజువారీ అవసరాలకు తగినంత నీరు లేక పోవచ్చు. దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో ,  అధికమైన  వ్యవసాయం కొరకు తీవ్రమైన ఎరువులు మరియు పురుగుమందుల ఉపయోగం; పేలవంగా నియంత్రించబడిన పరిశ్రమల  నుండి విష రసాయనాల వ్యర్ధాలు,  పేలవంగా నిర్వహిస్తున్న  పారిశుధ్యం నుండి మురుగునీరు  భూగర్బజలాల ను కలుషితం చేస్తున్నాయి .
 
UKలోని వాటర్‌ఎయిడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ వైన్‌రైట్ ఇలా అన్నారు: “మా పరిశోధనలు ద్వారా ఆఫ్రికాలో నీటి కొరత ఏర్పడుతుందనే అపోహ ను తొలగించాయి. కానీ ఆ ఖండంలోని లక్షలాది మందికి ఇప్పటికీ తాగడానికి సరిపడా స్వచ్ఛమైన నీరు లేకపోవడం చాల విచారకరం. ఆ ప్రజల పాదాల క్రింద చాలా నీటి నిల్వలు లేదా భూగర్భజలాలు ఉన్నాయి, వాటిలో చాలావరకు వర్షపాతం ద్వారా లేదా ఇతర ఉపరితల నీటి ద్వారా ప్రతి సంవత్సరం భూగర్భజలాలు భర్తీ చేయబడుతున్నాయి, అయితే దీర్ఘకాలికంగా తక్కువగా నిధులు ఉన్నందున వారు ఆ భూగర్భజలాల వెలికితీత సేవలను  ఉపయోగించ లేరు. వాతావరణ సంక్షోభం ఎదురైనా భూగర్భ జలాలను ఉపయోగించడం వల్ల మిలియన్ల మందికి  సురక్షితమైన, స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుంది.
 
భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్‌లలో వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు కావలసిన భూగర్భ జలాలు, ఇండో-గంగా బేసిన్ సరిహద్దుల నుండి భూగర్భ జలాల సంగ్రహణ మొత్తం ప్రపంచ భూగర్భ జలాల ఉపసంహరణలో 25% కలిగి ఉంది. నాసా గ్రావిటీ రికవరీ మరియు క్లైమేట్ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్‌ల నుండి సేకరించిన డేటా నుండి రీడింగ్‌లు భూగర్భజలాల క్షీణతను చూపుతున్నాయి. పంజాబ్ మరియు హర్యానా (ఢిల్లీతో సహా) డేటా ప్రకారం గా సింధు, బ్రహ్మపుత్ర మరియు గంగానది ఉమ్మడి వార్షిక ప్రవాహం, 200 మీటర్ల లోతు వరకు గల భూగర్భజలాల పరిమాణం కంటే 20 రెట్లు ఎక్కువగా ఉందని అంచనా వేసింది. 2000 నుండి 2012 మధ్య కాలం లో జలాశయంలోని నీటి మట్టం 70% స్థిరంగా లేదా పెరుగుతున్నట్లు డేటా చూపిస్తుంది.
 
ప్రపంచంలోని మంచినీటి వనరులలో భారతదేశం కేవలం 4% మాత్రమే కలిగి ఉంది. దశాబ్దాలుగా భూగర్భ జలాల వెలికితీత ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. గడచిన 50 సంవత్సరాలలో, బోర్‌వెల్‌ల సంఖ్య 1 మిలియన్ నుండి 20 మిలియన్లకు పెరిగింది, అదే  ప్రపంచంలోనే భూగర్భ జలాల ఉపయోగించే అతిపెద్ద వినియోగదారునిగా భారతదేశాన్నిమార్చింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం సుమారు 17% భూగర్భ జలాల బ్లాక్‌లు సాధారణం కంటే ఎక్కువగా  వినియోగించబడుతున్నాయి (అంటే నీటిని వెలికితీసే రేటు జలాశయం పునరుద్ధరణ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది) అయితే 5% మరియు 14% వరుసగా క్లిష్టమైన మరియు కొంచెం క్లిష్టమైన దశలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా వాయువ్య, పశ్చిమ మరియు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని మూడు ప్రధాన ప్రాంతాలలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
 
భారతదేశంలోని భూగర్భజలాల పరిస్థితిపై తన ఆలోచనలను తెలుపుతూ, వాటర్ ఎయిడ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ VK మాధవన్ ఇలా అన్నారు: “భూగర్భజలాలు అదృశ్యంగా ఉన్నా కూడా, అది తరిగిపోగలదని మనం గుర్తించాలి. భూగర్భ జలాల వెలికితీతను నియంత్రించడం మరియు దానిపై అవసరాన్ని తగ్గించడం మన తక్షణ కర్తవ్యం. అదే సమయంలో, మన జలాశయాలను ఒక క్రమపద్ధతిలో పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలి, ప్రత్యేకించి ఉపరితల నీటి వనరులను ఉపయోగించి మన పరిరక్షణ ప్రయత్నాలను పెంచడం ద్వారా మరియు రీఛార్జ్ జోన్‌లను పెంచడం ద్వారా భూగర్భజలాలను  కాపాడుకోవచ్చు. కలుషితమవుతు పెరుగుతున్న భూగర్భజలాలే సాక్ష్యంగా, అవసరమైన దానికంటే తీసుకున్న అతి  తక్కువ శ్రద్ధ సమస్యను సూచిస్తుంది. కనీసం ఇప్పుడైనా మనం తగిన చర్యలు తీసుకోవాలి.
 
"వాటర్ ఎయిడ్ భారతదేశం అంతటా అనేక జిల్లాల్లో కమ్యూనిటీ-ఆధారిత నీటి నాణ్యత పరీక్షల కోసం మరియు పర్యవేక్షణను రూపొందించడానికి ఇంకా నివాస ప్రాంతాలకు దగ్గరగా స్థిరమైన నీటి వనరుల ఆవశ్యక్తత ను  నిర్ధారించడానికి, నీటి సంరక్షణ కోసం వాటర్ ఎయిడ్  పని చేస్తోంది."
 
కొన్ని దేశాల్లో,ముఖ్యంగా దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలలో, భూగర్భజలాలు సహజంగానే ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్‌తో కలుషితమవుతున్నాయి. అక్కడి వారికీ చికిత్స అందించకపోతే అనారోగ్యం లేదా చివరకు మరణానికి కూడా దారితీస్తుంది. ఉదాహరణకు, భారతదేశంలోని, ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు తూర్పున పశ్చిమ బెంగాల్‌ల పై  ఆర్సెనిక్ కాలుష్యం తన  ప్రభావం చూపిస్తుంది.. ఒడిశాలోని అనేక జిల్లాలు అధిక ఫ్లోరైడ్, ఇనుము మరియు లవణీయతతో కూడి  తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మధ్య మరియు ఆగ్నేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నైట్రేట్ మరియు ఇనుము యొక్క అధిక స్థాయిలు కాలుష్యం చూపుతున్నాయి. 
 
ఇటీవల ప్రచురించిన 16వ బీహార్ ఆర్థిక సర్వే నివేదిక 2021-22 ప్రకారం గా బీహార్‌లోని 38 జిల్లాల్లోని 31 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు భారీగా కలుషితమవుతున్నాయని పేర్కొంది;అక్కడి నీటిలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, అలాగే ఇనుము  ద్వారా కాలుష్యం పెరుగుతుంది.38 జిల్లాల్లో 31 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, ఐరన్ అధికంగా ఉన్నాయని, ఇది ఆరోగ్యానికిపెను  ప్రమాదాన్నీ సూచిస్తుందని నివేదిక పేర్కొంది. 30,272 గ్రామీణ వార్డుల్లో భూగర్భ జలాల్లో రసాయన కాలుష్యం ఉంది. గంగా తీరాన ఉన్న 14 జిల్లాల్లోని మొత్తం 4,742 గ్రామీణ వార్డులు ముఖ్యంగా ఆర్సెనిక్ కాలుష్యంతో ప్రభావితమయ్యాయి.
 
నివేదిక ప్రకారం నిర్ణీత శాతంగా వార్షిక ప్రభుత్వ బడ్జెట్‌లు మరియు అంతర్జాతీయ దాతల నిధులు, ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడం ద్వారా అట్టడుగు వర్గాలకు అవసరమైన నీరు మరియు పారిశుద్యం అందించాల్సిన అవసరాన్ని మరింత నొక్కి చెప్తుంది. బాధ్యతాయుతమైన భూగర్భజలాల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం మరియు దీనికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యం, ఆర్థిక మరియు సంస్థాగత మద్దతు, వాతావరణ సంక్షోభం ,ముందు వరుసలో నివసించే కమ్యూనిటీలకు ప్రాణాలను కాపాడే స్థిరమైన మరియు సురక్షితమైన నీరు, పారిశుధ్యాన్ని అందించడం కీలకమని COP 27లో అంగీకరించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఇది నొక్కి చెప్పింది.
 
వాటర్‌ఎయిడ్ మరియు BGS ప్రకారం, మంచి నాణ్యత గల భూగర్భజలాలను అందుబాటులోకి తేవడమే కాకుండా స్థిరమైన మరియు పొదుపు మార్గంలో భూగర్భ జలాలను వెలికితీసి దాని పూర్తి సామర్థ్యాన్నిఉపయోగించడం, భూమి యొక్క భూగర్భ జలాలను బయల్పరచడానికి అవసరమైన దిశానిర్దేశం మరియు పర్యవేక్షణలో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం దీనిని సాధించడానికి గల ఒక మార్గం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెల్టాక్రాన్ వస్తోందా? లక్షణాలు ఏమిటి?